Whats APP : త్వరలోనే వాట్సాప్ ఇన్ యాప్ కెమెరాలో కొత్త ఫీచర్లు..!
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
- By Hashtag U Published Date - 07:00 AM, Sun - 13 February 22
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజుల్లో వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ లేదంటే…ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఉదయం లేచినుంచి రాత్రి పడుకునేంత వరకు వాట్సాప్ చూడనిది ఉండలేకపోతున్నారు జనాలు. చిన్నారుల నుంచి పెద్దలదాకా వాట్సాప్ చాటింగ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వాట్సాప్ తన వినియోగదారులను వదులుకోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తూనే ఉంది. యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తోంది. వాట్సాప్ ఐఓఎస్ యూజర్ల కోసం ఇన్ బిల్ట్ కెమెరాను, రీడిజైన్డ్ క్యాప్షన్ వ్యూతోసహా కొన్ని సరికొత్త ఫీచర్లపై పనిచేస్తోంది.
వీటితోపాటు లెటెస్టుగా బీటా వెర్షన్ లో యాప్ ఇన్ బిల్ట్ కెమెరా ఫీచర్ ను కూడా టెస్ట్ చేస్తోంది. అలాగే త్వరలోనే యాప్ ఇన్ బిట్ కెమెరా ఫీచర్‌ను కూడా పునరుద్ధరించనుందని 9 టు 5 మ్యాక్ రిపోర్ట్ వెల్లడించింది. వీటితోపాటుగా ఐఓఎస్ వినియోగదారుల కోసం బీటా వెర్షన్ 22.4.0.72లో ఇన్ బిల్ట్ కెమెరా మార్పుల చేయనుంది. దీంతో యూజర్లు వాట్సాప్ లో తీసే ఇన్ యాప్ ఫోటోలు మరింత భద్రం కానున్నాయి. మరోవైపు ఐఓఎస్ కోసం వాట్సాప్ లోని కెమెరా ఐకాన్‌ను కూడా రీడిజైన్ చేయనున్నట్లు రిపోర్టులో పేర్కొంది. ఈ మార్పులను ఇప్పటికే బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చేసాయి. తొందర్లోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానున్నాయి.
త్వరలో రీడిజైన్ క్యాప్షన్ వ్యూయింగ్ ఫీచర్…
రీడిజైన్ చేసి క్యాప్షన్ వ్యూయింగ్ ఫీచర్ ను త్వరలోనే వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. గతవారమే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ లో ఉంది. కాబట్టి ఇది ప్రస్తుతం బీటా టెస్టర్లకు అందుబాటులోకి రాలేదు. ఇక ఈ మధ్యే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ టైమ్ లిమిట్ ను కూడా పెంచున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags
Related News
Thalapathy Vijay: వామ్మో.. విజయ్ దళపతికి అన్ని వందల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా!
కోలివుడ్ స్టార్ విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.