WhatsApp: వాట్సాప్ లో వినియోగదారులకు గుడ్ న్యూస్.. గ్రూప్ లలో మరో సూపర్ ఫీచర్?
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ
- By Nakshatra Published Date - 07:00 AM, Fri - 10 March 23

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే సెట్టింగ్స్ విషయంలో స్టేటస్, ప్రొఫైల్, లాస్ట్ సీన్, చాట్ ఇలా అనేక రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుండడంతో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే వాట్సాప్ గ్రూపులకు సంబంధించి ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ వారు తాజాగా గ్రూప్ కి సంబంధించి మరో ఫీచర్ ని తీసుకువచ్చారు. ఎక్స్‌పైరింగ్ గ్రూప్ అనే పేరుతో వాట్సాప్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో తాత్కలిక అవసరం కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ కొంత సమయానికి ఆటోమెటిగ్‌గా డిలీట్ చేసుకోవచ్చు.
ఏ తేదీన గ్రూప్ డిలీట్ అవ్వాలో గ్రూప్ క్రియేట్ చేసే సమయంలో సెట్ చేసుకోవచ్చు. దీంతో అనవసర గ్రూప్‌లు వాటంతటవే డిలీట్ అవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. టెస్టింగ్ పూర్తికాగానే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్న ఈ సరికొత్త ఫ్యూచర్ వినియోగదారుల దృష్టిని కచ్చితంగా ఆకర్షిస్తుంది అలాగే వినియోగదారులను తప్పకుండా మెప్పిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాట్సాప్ సంస్థ వారు.

Related News

Create your Avatar in WhatsApp: వాట్సాప్‌లో అవతార్‌ను ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ప్రొఫైల్ పిక్ లా ఎలా ఉపయోగించాలి?
అవతార్‌ను పంపడం అనేది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో భావాలను పంచుకోవడానికి వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గం. వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఇమేజ్‌ని..