Whatsapp Msgs: వాట్సాప్ మెస్సేజ్‌లు వేరొకరికి కనిపించకుండా ఫీచర్.. అదెలా అంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని లక్షల మంది ఈ వాట్సాప్
- By Anshu Published Date - 09:30 AM, Thu - 8 September 22

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని లక్షల మంది ఈ వాట్సాప్ ను ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే ఈ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇంకా వాట్సాప్ లో సరికొత్త ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ మరొక సరికొత్త ఫీచర్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. వాట్సాప్ లో కెప్ట్ మెసేజెస్ అనే ఫీచర్ ను అభివృద్ధి చేయాలని చూస్తోంది.
వాట్సాప్ డిసప్పియరింగ్ మెస్సేజెస్ అనే ఫీచర్ ను ఎప్పుడో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫీచర్ మీ ఎనేబుల్ చేసుకుంటే నిర్దేశించిన సమయం తర్వాత మెస్సేజెస్ కనిపించకుండా పోతాయట. ఇలా మెస్సేజ్ లు కొంత సమయం తర్వాత కనిపించకుండా పోవడం నచ్చని వారి కోసం కెప్ట్ మెస్సేజెస్ అనే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఈ అందుబాటులోకి వస్తే డిసప్పియరింగ్ మెస్సేజెస్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకున్నా సరే మెస్సేజ్ లను జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు.
అయితే మెసేజ్ పంపినవారు, అలాగే స్వీకరించిన వారు సైతం సేవ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఆయా చాట్స్ ను సైతం తొలగించుకోవచ్చు. అయితే కెప్ట్ మెస్సేజెస్ ఫీచర్ ను వాట్సాప్ ఎప్పుడు అమల్లోకి తీసుకురానుంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.