WhatsApp: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్.. 21 ఎమోజీ లతో అలా?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ
- By Nakshatra Published Date - 08:10 AM, Tue - 14 March 23

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో వరుస అప్డేట్ లతో వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుంది వాట్సాప్ సంస్థ. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా వాట్సాప్ కంపెనీ 21 కొత్త ఎమోజీలను లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా చిన్న చిన్న మార్పులతో 8 ఎమోజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ డివైజ్ లలో ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వాట్సాప్ బీటా ఇన్‌స్టాల్ చేసుకున్న బీటా టెస్టర్ లకు కొత్త ఎమోజీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాగా అవి దశల వారీగా ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇదే విషయాన్ని WABetainfo వెల్లడించింది. వివరాలను కూడా తెలిపింది. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. మేము ఇంతకుముందే యూనికోడ్ 15.0 నుంచి 8 ట్వీక్డ్ ఎమోజీలు, 21 కొత్త ఎమోజీల గురించి సమాచారాన్ని షేర్ చేశాం. 21 కొత్త ఎమోజీలు డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉండటంతో కీబోర్డ్‌లో కనిపించలేదు.
ఆల్టర్నేటివ్ కీబోర్డ్‌ని ఉపయోగించి వాటిని సెండ్ చేయవచ్చని తెలిపాము. అయితే ఇప్పుడు బీటా టెస్టర్‌ల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ 2.23.5.13 వెర్షన్‌ని ఆండ్రాయిడ్ బీటా అందుబాటులో ఉంది. ఇందులో అఫిషియల్ వాట్సాప్ కీబోర్డ్‌లో బీటా టెస్టర్‌లు కొత్త ఎమోజీలను చూడవచ్చు అని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.
కాగా ఇప్పుడు కొత్త బీటా వెర్షన్‌లో 21 ఎమోజీలను తాజా యూనికోడ్ 15.0 నుంచి అధికారిక వాట్సాప్ కీబోర్డ్‌లోనే పంపడం సాధ్యం అవుతుంది. కాబట్టి ఇకపై వాటిని పంపడానికి వేరే కీబోర్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. కొత్త ఎమోజీల పరిచయం చివరకు వినియోగదారుల మధ్య గందరగోళానికి కారణమైన సమస్యను దూరం చేసింది. అయితే ఇప్పటికే చాలా మంది యూజర్లు కొత్త ఎమోజీలను రిసీవ్ చేసుకొన్నారు, కానీ తిరిగి సెండ్ చేయడం సాధ్యం కాలేదు. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

Related News

Create your Avatar in WhatsApp: వాట్సాప్‌లో అవతార్‌ను ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ప్రొఫైల్ పిక్ లా ఎలా ఉపయోగించాలి?
అవతార్‌ను పంపడం అనేది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో భావాలను పంచుకోవడానికి వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గం. వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఇమేజ్‌ని..