Phone battery save: మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా.. అయితే ఈ నాలుగు సెట్టింగ్స్ ను మార్చాల్సిందే?
మామూలుగా మనకు ఫోన్లు కొత్తలో చార్జింగ్ బాగా వస్తూ ఉంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ మొబైల్ ఫోను వినియోగించే కొద్ది బ్యాటరీ పనితీరు అంత మెరు
- By Nakshatra Published Date - 07:30 PM, Wed - 24 January 24
మామూలుగా మనకు ఫోన్లు కొత్తలో చార్జింగ్ బాగా వస్తూ ఉంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ మొబైల్ ఫోను వినియోగించే కొద్ది బ్యాటరీ పనితీరు అంత మెరుగ్గా ఉండదు. కొద్దిసేపు ఉపయోగించినా చాలు వెంటనే చార్జింగ్ ఎక్కువ మొత్తంలో అయిపోతూ ఉంటుంది. దీంతో చార్జింగ్ విషయంలో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇలా చార్జింగ్ త్వరగా అయిపోవడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఫోన్ లో అతిగా ఉపయోగించడం ఇతర చార్జర్లను ఉపయోగించడం, 90% ఎక్కినా కూడా చార్జింగ్‌ను అలాగే పెట్టడం, పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యే వరకు మొబైల్ ని యూస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
వీటి వల్ల కూడా బ్యాటరీ పనితీరు దెబ్బతింటు ఉంటుంది. అయితే ఇలా బ్యాటరీ పనితీరు తగ్గిపోయి పదేపదే ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతుంటే అలాంటప్పుడు మీరు ఫోన్లో నాలుగు రకాల సెట్టింగ్స్ ను సరి చేస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో,ఎలాంటి సెట్టింగ్స్ ను సరి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో మొదటిది స్క్రీన్ టైంని పరిమితంగా ఉంచడం. ఎందుకంటే ఫోన్ వాడకుండా ఉండి లేదా వాడిన తర్వాత అలాగే ఉంచితే స్క్రీన్ ఎక్కువ సేపు ఆన్ లో ఉండడం వల్ల బ్యాటరీ ఖర్చవుతూనే ఉంటుంది. అందువల్ల వీలైతే ఫోన్ స్క్రీన్‌ను 15 లేదా 30 సెకన్ల పాటు ఆన్‌లో ఉంచేలా సెట్టింగ్స్ మార్చాలి.
దీంతో 15 సెకన్ల తర్వాత ఇన్‌యాక్టివ్ స్క్రీన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది, ఫోన్ లాక్ చేయబడుతుంది. అలాగే మీరు ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ను చాలా ఎక్కువగా ఉంచుతున్నట్లయితే బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అందువల్ల, స్క్రీన్ బ్రైట్నెస్ను ఎక్కువగా ఉంచవద్దు. మీ స్క్రీన్‌ను ఆటోమేటిక్ బ్రైట్నెస్లో సెట్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కాంతిని బట్టి బ్రైట్ నెస్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అదేవిధంగా కొందరు కీబోర్డ్ ట్యాప్‌లో సౌండ్ సెట్ చేస్తుంటారు. దీంతో టైప్ చేసినప్పుడు సౌండ్, వైబ్రేషన్ కూడా వస్తుంది. తరచుగా కీబోర్డ్ శబ్దాలు, వైబ్రేషన్లు అధిక బ్యాటరీ వినియోగానికి కారణమవుతాయి. అలాగే మీరు సెట్టింగ్‌లకు వెళ్లి, ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుందో చెక్ చేయవచ్చు. ఇక్కడ మీరు బ్యాటరీ వినియోగాన్ని చూడటం ద్వారా ఆ యాప్‌లను నియంత్రించవచ్చు లేదా బలవంతంగా ఆపవచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్లలో డార్క్ థీమ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. కాబట్టి మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ చేయడం మంచిది. దీని కారణంగా, ఫోన్ బ్యాటరీ నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు ఉంటుంది.
Related News
Tech Tips: మీరు ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?
ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది అనేక రకాలు వాటి కోసం ల్యాప్‌టాప్ లను వినియోగిస్తున్నారు. కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళ