Twitter: ట్విట్టర్ లో పోస్ట్ ల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.. ప్రాసెస్ ఇది?
ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ సరైన సంపాదన లేక సంపాదించినది సరిపోక ఇతర మార్గాల
- By Nakshatra Published Date - 06:30 PM, Fri - 14 April 23
ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ సరైన సంపాదన లేక సంపాదించినది సరిపోక ఇతర మార్గాల బాటపడుతున్నారు. డబ్బు సంపాదించడం కోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా అన్న విషయాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాప్ ద్వారా డబ్బులు సంపాదించడం ఏంటి అనుకుంటున్నారా. అవునండి.. ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా యూసర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా మాత్రమే కాకుండా ఇప్పుడు యూజర్లు ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యూజర్లు తమ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక అందులో భాగంగానే మానిటైజేషన్ ఆప్షన్ తీసుకువచ్చినట్టు మస్క్ వెల్లడించారు. భారీ టెక్ట్స్ కంటెంట్, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు సహా తమ కంటెంట్ పై యూజర్లు సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకోవచ్చని, తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపారు.
ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి మానిటైజ్ అనే ఫీచర్ పై క్లిక్ చేస్తే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. కానీ ఈ మానిటైజేషన్ ఆప్షన్ ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులో ఉందని, త్వరలోనే మిగిలిన దేశాలకు కూడా వర్తింపజేస్తామని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ మానిటైజేషన్ ప్రోగ్రాం ద్వారా యూజర్లకు లభించే డబ్బులో 12 నెలల పాటు ట్విట్టర్ ఏమీ తీసుకోబోదని తెలిపారు. యూజర్లు ఎప్పుడు కావాలనుకున్నా తమ కంటెంట్ తో ట్విట్టర్ ను వీడవచ్చని మస్క్ స్పష్టం చేశారు.
Related News
KCR Entered Social Media: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్..!
ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్ వాడని కేసీఆర్ తాజాగా ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు.