Top Smart Phones: కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా.. అయితే ఈ ఫోన్స్ పై ఒక లక్కేయాల్సిందే!
కొత్త స్మార్ట్ కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికీ ఒక చక్కటి శుభవార్తను తెలిపింది అమెజాన్. కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్స్ ని అందిస్తోంది.
- By Anshu Published Date - 04:38 PM, Sun - 24 November 24

ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ లు ఏవి?వాటిపై ఏ మేరకు డిస్కౌంట్ లభిస్తోంది అన్న విషయానికి వస్తే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా.. ఇటీవల కాలంలో ఎక్కువగా పాపులర్ పొందిన ఆ ఫ్లాగ్ షిప్ ఫోన్ లలో ఈ ఫోన్ కూడా ఒకటి. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ తో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వినియోగదారులకు అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించడానికి అసాధారణమైన కెమెరా సామర్థ్యాలను గెలాక్సీ ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రస్తుతం అమెజాన్ లో 47శాతం తగ్గింపుతో కేవలం రూ.79999 విక్రయ ధరతో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 15 ప్లస్.. ఫోన్ విషయానికి వస్తే..ఈ స్మార్ట్‌ఫోన్ ఎ16 బయోనిక్ చిప్ తో వస్తుంది. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వాస్తవానికి, ఐఫోన్ 15 ప్లస్ రూ.79900కి రిటైల్ అవుతుంది. అయితే అమెజాన్ నుంచి కొనుగోలుదారులు కేవలం రూ.69900కి పొందవచ్చు. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పై గొప్ప 22శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
వన్‌ప్లస్ 12ఆర్.. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. వన్‌ప్లస్ 12ఆర్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ తో 8జీబీ ర్యామ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలతో వస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ రూ.39999 వద్ద లాంచ్ అయింది. అమెజాన్ లో కేవలం రూ.35999కి అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు అదనపు బెనిఫిట్స్ కోసం బ్యాంక్ ఆఫర్ లను కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎ35.. ఈ ఫోన్ అమెజాన్ లో కొనుగోలుదారులు సరసమైన ధరకు శాంసంగ్ ద్వారా మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎ35 8జీబీ ర్యామ్ తో శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ తో వస్తుంది. మల్టీ టాస్కింగ్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.33999కి రిటైల్ అవుతుంది. అయితే, అమెజాన్‌లో రూ.30999కి అందుబాటులో ఉంది.
పిక్సెల్ 8ప్రో.. ఈ గూగుల్ పిక్సెల్ 8 ప్రో ప్రస్తుతం అమెజాన్ లో భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ టెన్సర్ జీ3 చిప్‌సెట్, 12జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏఐ ఫీచర్లు, జెమిని నానో సపోర్ట్ తో వస్తుంది. ఏఐ యుగంలో స్మార్ట్ ఫోన్ ను స్మార్ట్‌గా మార్చింది. మీరు ఈ పిక్సెల్ 8 ప్రో అసలు ధర రూ.106999 ఉండగా రూ.63999 తగ్గింపు పొందవచ్చు.