Kawasaki Bikes: కవాసకీ బైక్స్ పై భారీ డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే?
ఐరో స్పేస్ కంపెనీ అయిన కవాసకీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేసిన
- By Anshu Published Date - 07:00 AM, Mon - 6 February 23

ఐరో స్పేస్ కంపెనీ అయిన కవాసకీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త బైక్స్ ని తీసుకురావడంతోపాటు కొన్ని కొన్ని సార్లు విడుదలైన బైక్స్ లోనే కొత్త ఫీచర్స్ ని పరిచయం చేస్తోంది. అంతేకాకుండా మార్కెట్లో కవాసకీ బైక్స్ ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కవాసకీ కంపెనీ ఒక మూడు బైక్స్ ని సెలెక్ట్ చేసి బైకులపై భారీగా తగ్గింపును ప్రకటించింది. అయితే ఆఫర్ కేవలం ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉండరు.
మరి ఆ బైక్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కవాసాకీ డబ్ల్యూ 800.. కవాసకీ కంపెనీ ఈ మోడల్ పై దాదాపుగా రూ.2 లక్షల వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అనగా రూ.7.33 లక్షల ఉన్న ఈ బైక్ ప్రస్తుతం తగ్గింపు ఆఫర్ తో రూ.5.33 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. డబుల్ సిలిండర్లతో పాటు ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ వర్టికల్ ట్విన్ 773 సీసీ ఇంజిన్ తో ఇది వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరో బైక్ నింజా 300.. నింజా 300 బైక్ పై కవాసకీ సంస్థ రూ.15000 తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంటే అసలు ధర రూ.3.40 లక్షలు ఉన్న ఈ బైక్ ని ఇప్పుడు రూ.3.25 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
296 సీసీ ఇంజిన్ తో డబుల్ డిస్క్ బ్రేక్ తో వచ్చే ఈ బైక్ ను యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరో జెడ్ 650, జెడ్ 650 ఆర్ఎస్.. కవాసకీ కంపెనీ ఈ బైక్ లపై రూ.50,000 వరకూ తగ్గించింది. జెడ్ 650 ఇప్పుడు రూ.5.93 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే జెడ్ 650 ఆర్ఎస్ రూ.6.42 లక్షలకు అందుబాటు ఉంది. ఈ రెండు బైక్స్ లో 649 సీసీ ఇంజిన్ తో పాటు డబుల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి.