Phone Shortcuts: ఫోన్ లో ఈ షార్ట్ కట్స్ గురించి మీకు తెలుసా.. ఒక్క సైడ్ బటన్ తో?
ఆండ్రాయిడ్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది శాంసంగ్ గెలాక్సీ ఫోన్స్. స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదలైన కొత్తలో వీటి క్రేజ్ మామూలుగా లేదు
- By Nakshatra Published Date - 07:00 PM, Tue - 27 June 23
ఆండ్రాయిడ్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది శాంసంగ్ గెలాక్సీ ఫోన్స్. స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదలైన కొత్తలో వీటి క్రేజ్ మామూలుగా లేదు. అంతేకాకుండా ఒకానొక దశలో ఈ ఫోన్ లకు గట్టి పోటీని ఇచ్చే మరో కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదు అనే భావనకు వచ్చేసారు వినియోగదారులు. ఇక అప్పటి నుంచి తన స్థానాన్ని కాపాడుకునేందుకు శామ్సంగ్ శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. ఎన్ని కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లు వచ్చినా శామ్సంగ్ తన స్థానాన్ని కాపాడుకుంటూనే వస్తోంది. దానికి ప్రధాన కారణం శామ్సంగ్ గేలాక్సీ ఫోన్లలోనే ఫీచర్లు అనే చెప్పాలి.
అలాగే శామ్సంగ్లో బేసిక్ ఫీచర్లతో అతి తక్కువ ధర నుంచి హై ఎండ్ ఫీచర్లతో కూడిన అధిక ధర ఫోన్ల వరకూ అన్ని రకాల బడ్జెట్లలో గేలాక్సీ ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లోని ఫీచర్లను చాలా మంది వినియోగదారులు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. అలాగే శామ్సంగ్ గేలాక్సీ ఫోన్లలో ఉండే షార్ట్ కట్ లను కూడా వాడలేకపోతున్నారు. అందుకే శామ్ సంగ్ గేలాక్సీ ఎస్23 అల్ట్రా నుంచి గేలాక్సీ ఏ54 వరకూ అన్ని రకాల శామ్సంగ్ గేలాక్సీ ఫోన్ లోనూ వాడదగిన షార్ట్ కట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మామూలుగా ఐఫోన్ లో లభించిన సూపర్ షార్ట్ కట్ శామ్సంగ్ ఫోన్ లో కూడా లభిస్తుంది. అదేంటంటే శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ లో సైడ్ ఉండే పవర్ కీ బటన్ రెండు సార్లు నొక్కితే కెమెరా ఓపెన్ అవుతుంది. అన్ని ఆండ్రాయిడ్లలోనూ ఇదే ఉంటుంది. కానీ శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ లలో మాత్రం ఏ యాప్ అయినా ఓపెన్ చేసేలా అవకాశం ఉంటుంది. దాని కోసం మీరు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దానిలో సైడ్ కీ సెట్టింగ్స్ అని ఉంటాయి. దానిని ఓపెన్ చేస్తే మీకు యాప్ లిస్ట్ కనిపిస్తుంది. మీరు ఏ యాప్ తెరవాలని భావిస్తున్నారో అదే యాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇది శామ్సంగ్ వాయిస్ ఇంటర్ ఫేస్ కాబట్టి దీనిని వినియోగించుకోవడం మేలు.
అలాగే శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు ఉపయోగించేవారు బిక్స్బైని యాక్టివేట్ చేసుకోకపోతే ఆ ఫోన్ నుంచి మీరు ఎక్కువ ప్రయోజనాలు పొందలేరు. అయితే ఇది గూగుల్ అసిస్టెంట్, లేదా సిరి వంటిది కాదు. ఇది మీ ఫోన్ ని వేగంగా ఆపరేట్ చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. మీకు ఏది తెలియకపోయినా అది చేసిపెడుతుంది. వైఫై ఆన్ చేయాలన్నా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలన్నా హాట్ స్పాట్ ఆన్ చేయాలన్నా ఏదైనా అదే చేసేస్తుంది. అందుకోసం దాని పేరును కూడా మీరు పలకాల్సిన పనిలేదు. కేవలం సైడ్ బటన్ నొక్కి మీకు అవసరం అయినా దానిని చెబితే చాలు అది చేసిపెడుతుంది.
వైఫై, బ్లూటూత్ వంటివి త్వరితగతిన ఆన్ అండ్ ఆఫ్ కావాల్సి ఉంటుంది. వాటిని క్విక్ సెట్టింగ్స్‌లో పెట్టుకొని అది ఎప్పుడైనా ఓపెన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే క్విక్ సెట్టింగ్ లలో కిడ్స్ మోడ్ ను కూడా పెట్టుకోవచ్చు. దాంతో ఒక్క బటన్‌తో కిడ్స్ స్క్రీన్ ఎనేబుల్ అవుతుంది. అలాగే థియేటర్ మోడ్ వంటి ఫోకస్ మోడ్‌లను కూడా వేగంగా ఆన్ చేయొచ్చు. దీనికోసం మీరు ఫోన్లో హోమ్ స్క్రీన్ నుంచి కిందికి స్వైప్ చేయాలి. అప్పుడు నోటిఫికేషన్ బార్ ఓపెన్ అవుతుంది. క్విక్ సెట్టింగ్ బటన్ల గ్రిడ్ కనబడటానికి మళ్లీ స్వైప్ చేయండి. ఆ తర్వాత ఎడమవైపునకు స్వైప్ చేసి హైడ్ అయిన అన్ని బటన్ లను యాడ్ చేయడానికి +బటన్‌ను నొక్కాలి.
Related News
Smartphone Pinky : ‘స్మార్ట్‌ఫోన్ పింకీ’ వస్తోంది.. బీ కేర్ ఫుల్ !!
Smartphone Pinky : స్మార్ట్‌ఫోన్‌ను మనలో చాలామంది అతిగా వాడేస్తున్నారు.