Tech Tips: మీ ఫోన్ లో డేటా అయిపోకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చాల్సిందే!
ఫోన్ లో త్వరగా డేటా అయిపోతుంది అనుకున్న వారు కొన్ని రకాల సెట్టింగ్స్ ని మార్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
- By Anshu Published Date - 11:30 AM, Mon - 2 September 24

స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ లో డేటా సమస్య కూడా ఒకటి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ ని వినియోస్తూనే ఉంటారు. దీంతో ఇంటర్నెట్ చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు తక్కువగా స్మార్ట్ ఫోన్ ని వినియోగించినా కూడా డేటా చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. అయితే అలా డేటా త్వరగా అయిపోతుంటే కొంతమంది కొన్నిసార్లు కంపెనీకి ఫోన్ చేసి ప్రాబ్లం రిపోర్ట్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయినా కూడా పదేపదే ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటే కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి డేటా త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఎలాంటి సెట్టింగ్స్ మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే కొన్ని చిట్కాలతో స్మార్ట్‌ఫోన్ లో లభించే డేటాను నియంత్రించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చట. ఇంటర్నెట్ త్వరగా అయిపోతుందని భావిస్తే ఈ సెట్టింగ్ చేస్తే, ఇంటర్నెట్ మీ ఫోన్‌లో త్వరగా అయిపోకుండా ఎక్కువసేపు ఉంటుందట. ఫోన్‌లోని డేటాను నియంత్రించడానికి, ఫోన్ బ్రౌజర్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. దీని తర్వాత డేటా సేవర్ లేదా సేవ్ డేటా మోడ్ ను ఆన్ చేయాలి. ఫోన్ లోని డేటాను నియంత్రించడానికి, ఫోన్ బ్రౌజర్ సెట్టింగ్ లకు వెళ్లాలి. దీని తర్వాత డేటా సేవర్ లేదా సేవ్ డేటా మోడ్ ను ఆన్ చేయాలి. దీని తర్వాత బ్రౌజర్ సెట్టింగ్‌లలో పిక్చర్ ఇన్ పిక్చర్ ఎంపికను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెబ్ పేజీ ఫోటోను డౌన్‌లోడ్ చేయడానికి సమయం పడుతుంది. కానీ డేటా వినియోగం తగ్గుతుంది.
బ్రౌజర్ సెట్టింగ్ లకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ డేటా ఆప్షన్ ను ఆఫ్ చేయాలి. దీని తర్వాత బ్రౌజర్ సెట్టింగ్ లలో పిక్చర్ ఇన్ పిక్చర్ ఎంపికను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెబ్ పేజీ ఫోటోను డౌన్‌లోడ్ చేయడానికి సమయం పడుతుంది. కానీ డేటా వినియోగం తగ్గుతుంది. బ్రౌజర్ సెట్టింగ్ లకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ డేటా ఆప్షన్ ను ఆఫ్ చేయాలి. అలాగే స్మార్ట్‌ఫోన్ లో డేటా వినియోగాన్ని నియంత్రించడానికి మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, తర్వాత నెట్‌వర్క్, ఇంటర్నెట్ ఎంపికకు వెళ్ళాలి. మొబైల్ నెట్‌వర్క్‌కి వెళ్లి తక్కువ డేటా వినియోగం ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇది డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది. ఫోన్ లోని డేటాను నియంత్రించడానికి మరో సెట్టింగ్ ను చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
దీని తర్వాత మీరు సెర్చ్‌లో యాప్ కోసం సెర్చ్ చేసి, ఆపై యాప్ ఆప్షన్‌లకు వెళ్లి బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లకు వెళ్లి యాప్‌ను క్లోజ్ చేయాలి. అదేవిధంగా మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై డేటా సేవర్ మోడ్‌ను సెర్చ్ చేయాలి. దీని తర్వాత ఆటో ప్లే వీడియో ఎంపికను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌లో వీడియోను స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియో ప్లే కాదు. చాలా ఫోన్ లలో యాప్ అప్‌డేట్ ఆటో మోడ్ లో పనిచేస్తుంది. ఈ ఎంపికను కూడా ఆఫ్ చేయవచ్చు. దీని కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్ అప్‌డేట్ ఆప్షన్‌కు వెళ్లి ఆటో అప్‌డేట్‌ను ఆఫ్ చేయాలి. ఈ విధంగా పైన చెప్పిన సెట్టింగ్స్ ను మారిస్తే మీ డేటాను మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే చాలాసేపు మొబైల్ ఫోన్ వినియోగించవచ్చు.