Smartphone Tips: మీ ఫోన్ నీటిలో పడిపోయిందా.. అయితే అసలు టెన్షన్ పడకండి.. వెంటనే ఇలా చేయండి!
మొబైల్ ఫోన్ నీటిలో పడిపోతే ఏం చేయాలి? అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:05 PM, Mon - 17 March 25

మనం కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తగా ఉన్నా సరే అనుకోకుండా మన మొబైల్ ఫోన్ జారీ వాటర్ లో పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలా పడిపోయిన కొన్ని మొబైల్ ఫోన్లు వెంటనే దొరికితే మరికొన్ని చెరువులు చిన్నచిన్న కాలువలు పడిన ఫోన్లు బయటకు తీయడానికి కొంచెం సమయం పడుతుంది. అలాగే కొన్నిసార్లు ఏదైనా సమస్యల వల్ల ఫోన్ లో కూడా నీరు చేరవచ్చు. దీని వల్ల ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుందట. పొరపాటున ఫోన్ లో నీరు చేరినట్లయితే ఎలాంటి టెన్షన్ పడకుండా ఈ చిట్కాలను పాటిస్తే ఫోన్‌కు ఎలాంటి హాని ఉండదని చెబుతున్నారు.
మీ ఫోన్‌లోకి నీరు చేరినట్లయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ పాటించాల్సి ఉంటుందట. దీంతో మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్ చేయాలి. మీ ఫోన్ లో నీరు చేరినట్లయితే వెంటనే దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించాలట. ఎందుకంటె ఇది షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే సిం కార్డ్ మెమొరీ కార్డు వంటివి తీసేయాలట. దీనివల్ల ఫోన్లోకి నీరు చేరినప్పటికీ సిమ్ కార్డ్ మెమొరీ కార్డు దెబ్బ తినడం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు.
ఫోను కాస్త ఎండ తగిలిన ప్రదేశంలో పెట్టడం మంచిది. లేదంటే ఫ్యాన్ కింద కూడా పెట్టవచ్చు. ఒకవేళ మీ ఫోన్ లోపల నీరు చేరినట్లయితే మీ స్మార్ట్ ఫోన్ ని బియ్యం సంచిలో కొన్ని గంటల పాటు ఉంచడం వల్ల బియ్యం త్వరగా తేమను గ్రహిస్తాయట. ఒకవేళ మీకు దగ్గరలో సర్వీసెస్ సెంటర్ ఉంటే వెంటనే అక్కడికి వెళ్లిపోవడం మంచిది. లేదనుకున్నవారు పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే చాలా వరకు మొబైల్ ఫోన్ చెడిపోకుండా జాగ్రత్త పడవచ్చు అని చెబుతున్నారు.