Smart Phone Checking: మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ నకిలీదా? ఒరిజినలా?.. తెలుసుకోండిలా!
టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది.
- By Anshu Published Date - 03:46 PM, Tue - 8 November 22

టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారు చాలా తక్కువగా ఉంటారు అని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరి చేతిలో చూసినా ఈ స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తూ ఉంటుంది. మనుషులు పక్కల ఉన్న బంధాలను కూడా పట్టించుకోకుండా ఫోన్ లకు అడిక్ట్ అయిపోతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా రోజురోజుకీ అంతకంతకూ పెరిగిపోతూ ఉండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా సరికొత్త ఫీచర్లతో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నారు.
అయితే ఇదివరకు స్మార్ట్ ఫోన్లు అత్యధిక ధరతో ఉండగా రానురాను అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అయితే మార్కెట్ బ్రాండ్ ల పేర్లతో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. కొందరు సైబర్ నేరగాళ్లు స్మార్ట్ ఫోన్ లను ట్యాంపరింగ్ చేస్తున్నారు. కస్టమర్లను మోసం చేసి ఒరిజినల్ ఫోన్లకు బదులుగా డమ్మీ ఫోన్ లను విక్రయిస్తున్నారు. ఒరిజినల్ మొబైల్ ఫోన్ లోని బాడీ పార్ట్స్ ను తీసేసి డమ్మీ పార్ట్స్ వేస్తున్నారు. పైకి బ్రాండ్ సింబల్ బాడీ కటౌట్స్ అన్ని సేమ్ ఉన్నప్పటికీ లోపల అసలు కథ వేరేగా ఉంది. అయితే మీరు కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ ఒరిజినలా? డమ్మీ నా? ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అందుకోసం ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ సంప్రదించాల్సి ఉంటుంది. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కు ఒక మెసేజ్ చేయాలి. మీ మొబైల్ ఫోన్ నుంచి KYM అని టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి. ఆ తర్వాత 15 అంకెలు గల మీ మొబైల్ IMEI నెంబర్ ను ఎంటర్ చేసి 14422 నెంబర్ కి మెసేజ్ ను సెండ్ చేయాలి. కొంత సమయం తర్వాత మీ మొబైల్ కు రిప్లై వస్తుంది. మీ మొబైల్ కి సంబంధించిన మొత్తం సమాచారం ఆ మెసేజ్ లో ఉంటుంది. దాన్నిబట్టి మీరు మీ ఫోన్ ఒరిజినల్లా లేదా డూప్లికేటా అన్న విషయం తెలుసుకోవచ్చు.