Redmi Note 12 Series: రెడ్ మీ నోట్ 12 సిరీస్.. ధర ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన
- By Anshu Published Date - 06:00 PM, Thu - 20 October 22

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల తీసుకురావడానికి షావోమి సిద్ధమయ్యింది. రెడ్ మీ నోట్ 12 సిరీస్ ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. కాగా ఇప్పటివరకు షావుమీ రెడ్మీ నోట్ లైన్ అప్ లో వచ్చిన అన్ని సీరిస్ లు హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ లో రెడ్ మీ నోట్ 12 ప్రో, రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ నెలలో ఈ సీరిస్ ను చైనాలో లాంచ్ చేయనున్నట్లుగా షావోమితాజాగా అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత రెండు నెలల్లో ఈ మొబైల్ ఫోన్లో కొన్ని చిన్నచిన్న స్పెసిఫికేషన్ల మార్పులతో భారత్ లోకి కూడా విడుదల చేయనున్నారట. అయితే చైనాలో కూడా ఈ రెడ్ మీ నోట్ 12 సిరీస్ ను ఎప్పుడు లాంచ్ చేయనున్నారు అన్నది డేట్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. మరొక మూడు రోజుల్లో తేదీని ఫిక్స్ చేసి వెల్లడిస్తారట.
రెడ్ మీ నోట్ 12 సిరీస్‌లో మొబైల్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుందని లీక్‌లు వచ్చాయి. ఈ సిరీస్‌లో మూడు మొబైల్స్ కూడా 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. నోట్ 12 ప్రో ప్లస్,నోట్ 12 ప్రో మొబైల్స్ 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయని తెలుస్తోంది. నోట్ 12 ప్రో ఫోన్ లో 4,980 mAh బ్యాటరీ, నోట్ 12 ప్రో ప్లస్ లో 4,300mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. అలాగే రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్ 210 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కొన్ని లీక్‌లు వచ్చాయి. నోట్ 12 ప్రో 120వాట్స్, నోట్ 12 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తాయని తెలుస్తోంది. 200వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో ప్రస్తుతం ఐకూ 10 ప్రో టాప్‌లో ఉంది.