Realme 13 Pro Phones: మార్కెట్లోకి మరో రెండు రియల్ మీ సూపర్ స్మార్ట్ ఫోన్స్.. పూర్తి వివరాలివే?
ఇప్పటికే మార్కెట్లోకి చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన రియల్ మీ సంస్థ తాజాగా మరో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది.
- By Anshu Published Date - 12:25 PM, Wed - 31 July 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే కూడా రియల్‌మీ మార్కెట్ లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనుంది. రియల్‌మీ 13 ప్రో సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 13 ప్రో 5జీ, రియల్‌మీ 13 ప్రో + 5జీ అనే రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ స్టోరేజీ విషయానికొస్తే.. రియల్ మీ 13 ప్రో 8 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 512 జీబీ వేరియంట్లలో లాంచ్ అయింది. దీని బేస్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, మిడ్ వేరియంట్ ధర రూ.31,999.
ఈ ఫోన్ టాప్ ఎండ్ వేరియంట్ కోసం రూ.33,999 చెల్లించాల్సి ఉంటుంది. 3 వేల రూపాయల బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ధరలు ఉన్నాయి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ లాంటి రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఇక రియల్‌మీ 13 ప్రో విషయానికి వస్తే.. ఇది మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.25,999 గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.28,999గా ఉంది. ఈ ఫోన్ 3 వేల రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ఫోన్ల ఎర్లీ బర్డ్ సేల్ జులై 30న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరగనుంది. వచ్చే నెల అనగా ఆగస్టు 6న మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ల తొలి సేల్ ప్రారంభం కానుంది.
జూలై 31 నుంచి ఈ ఫోన్లను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, 1080×2412 పిక్సెల్స్ రిజల్యూషన్ ను ఇందులో అందించారు. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. ప్రాసెసర్ గా స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనుక భాగంలో ఓఐఎస్ తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కూడా అందించారు. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. ఫోన్ లో ఇచ్చిన కెమెరాలు అనేక గొప్ప ఏఐ ఫీచర్లతో వస్తాయి.
80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ ఫోన్ బ్యాటరీ 5200 ఎంఏహెచ్ గా ఉంది.కాగా ఇందులో ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్ లో రెండు రియర్ కెమెరాలను అందిస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైట్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్ కాగా, ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.