Realme 13 4G: మార్కెట్లోకి విడుదల కాబోతున్న మరో రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే!
మార్కెట్ లోకి త్వరలో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు.
- By Anshu Published Date - 05:30 PM, Tue - 6 August 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రియల్ మీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే మరొకవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇకపోతే ఇటీవలె రియల్ మీ కొత్త సిరీస్ రియల్ మీ 13 ప్రో ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రియల్ మీ 13 ప్రో ప్లస్, రియల్ మీ 13 ప్రో పేరుతో వీటిని ఆవిష్కరించింది.
ఇవి స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో ఉన్నాయి. ఏఐ ఆడియో జూమ్, ఏఐ స్మార్ట్ రిమూవల్ వంటి కెమెరా ఫీచర్లతో వీటిని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వీటికి అదనంగా మరో ఫోన్ ను తీసుకొచ్చేందుకు రియల్ మీ ఏర్పాట్లు చేస్తోంది. రియల్ మీ 13 4జీ పేరిట దీనిని లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు 7 తేదీని ఇండోనేషియాలో ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇది లాంచ్ అయిన తర్వాత ఆగస్టు ఎనిమిదో తేదీన ఫ్లాష్ సేల్ ప్రారంభం అవుతుంది. రియల్ మీ 13 4జీ రిలీజ్ టీజర్లో పలు ఆసక్తికర విషయాలను కంపెనీ వెల్లడించింది. కాగా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 685 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.
అలాగే 120 హెర్జ్ అమోల్డ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ 67 వాట్ల వరకూ చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ పయోనీర్ గ్రీన్, స్కై లైన్ బ్లూ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ ఉంటుంది. సోనీ లిషియా ఎల్‌వైటీ 600 సెన్సార్ తో కూడిన పోర్ట్ రైట్ కెమెరాను లిగి ఉంటుంది. రియల్ మీ 13 4జీ ఫోన్లో చిప్‌సెట్, కెమెరా, ర్యామ్ సైజ్, స్క్రీన్ రకం, రిఫ్రెష్ రేట్, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ అన్నీ గత జూన్‌లో ప్రకటించిన రియల్ మీ 12 4జీ లో మనం చూసిన వాటికి సమానంగా ఉన్నాయి. కాబట్టి రియల్ మీ 13 4జీ కేవలం రీబ్యాడ్జ్ చేసిన రియల్ 12 4జీగా తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.