POCO X7 Pro 5G: భారత్లోకి విడుదలైన పోకో స్మార్ట్ ఫోన్స్.. ధర, ఫీచర్స్ పూర్తి వివరాలు ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థకు పోకో ఇప్పుడు మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది. ఈ ఫోన్ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
- By Anshu Published Date - 10:34 AM, Mon - 13 January 25

తాజాగా భారత మార్కెట్లోకి పోకో X7 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ లో చాలా ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను కంపెనీ పాత ఫోన్ పోకో X6 ప్రోతో పోల్చుకుంటే ఇందులో చాలానే ఫీచర్స్ ఉన్నాయి. పోకో X7 ప్రోలో స్మార్ట్‌ఫోన్‌లో మీరు 50 మెగా పిక్సెల్ ల కెమెరాను పొందవచ్చు. సెకండరీ కెమెరా 8 మెగా పిక్సెల్ లు ఉండవచ్చు. ఇది కాకుండా సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. అదే సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ 6550mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతునిస్తుంది. పోకో 5జీ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటేక్ డైమేన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది 50ఎంపీ ప్రధాన లెన్స్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫోన్‌కు 5500mAh బ్యాటరీ అందించింది. ఇది 45W ఛార్జింగ్ కు మద్దతునిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్ ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఐపీ 66/68/69 రేటింగ్, ఏఐ ఫీచర్లతో కూడా వస్తుంది. పోకో X7, X7 Pro స్మార్ట్‌ఫోన్ లు రెండూ రెండు కాన్ఫిగరేషన్ లలో ప్రారంభించింది. పోకో X7 5G 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. అయితే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది.
పోకో X7 ప్రో 5జీ దాని 8జీబీ రామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999 గా ఉంది. 12జీబీ రామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.29,999 గా ఉంది. ఇకపోతే పోకో X7 5జీ విక్రయం జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తేలావాదేవీ లపై ఫోన్‌పై రూ. 2000 తగ్గింపు లభిస్తుంది. బ్యాటరీ, కెమెరాతో పాటు, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య గణనీయమైన తేడాలు లేవు.