Oppo A3X 5G: ఒప్పో నుంచి మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలివే?
ఇప్పటికే మార్కెట్లోకి చాలా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన ఒప్పో సంస్థ తాజాగా మరో 5 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.
- By Anshu Published Date - 11:13 AM, Sat - 3 August 24

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది ఒప్పో సంస్థ. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కాగా ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఒప్పో ఏ3 ఎక్స్ పేరుతో బడ్జెట్ ధరలో 5జీ ఫోన్ ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్ప్లాష్ టచ్ టెక్నాలజీతో పాటుగా ట్వైస్ రీఇన్‌ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి అత్యధిక ఫీచర్లను సైతం ఇందులో అందించారు. కాగా ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్ తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ ను కూడా అందించారు. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ను అందించారు. ఈ ఫోన్ 45 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే..
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది. తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. లాంచింగ్ ఆఫర్ లో భాగంగా కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 8 మెగాపిక్సెల్స్ తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా అందించారు. ఒప్పో ఏ3 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 45 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు. ఇక ఈ ఫోన్ కనెక్టివిటీ విషయానికొస్తే.. 5జీ, 4జీ ఎల్టీఈ, వై ఫై 5.3, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి మంచి మంచి ఫీచర్లను సైతం ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు.