Oppo F27 5G: మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్స్ గురించి తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే!
త్వరలో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఒప్పో.
- By Anshu Published Date - 01:30 PM, Mon - 19 August 24

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఒప్పో సంస్థ. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లోనే వేరియేషన్లను కూడా విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఒప్పో ఎఫ్27 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.
మరి త్వరలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో ఎఫ్27 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 వంటి పవర్‌ఫుల్ ప్రాసెసర్ ను ఇవ్వనున్నారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ లో 45 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. దీంతో ఫోన్ బ్యాటరీ వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. కాగా ఈ ఫోన్‌లో కెమెరాకు కూడా అధిక ప్రాధానత్య ఇచ్చారు. 50 మెగా పిక్సెల్స్‌తో మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్స్‌తో కూడిన పోర్ట్రైట్ కెమెరాతో కూడిన రెయిర్ కెమెరా సెటప్ ను అందించారు.
అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఏఐ స్టూడియో, ఏఐ ఏరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజన్ మ్యాటింగ 2.0 వంటి ఆర్టిఫిషియల్ సంబంధిత ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. ఒప్పో ఎఫ్27 5జీ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్ లో తీసుకొస్తున్నారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999గా ఉండనుంది. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1800 వరకు ఇన్‌స్టాంట్ క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. ఆరు నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ ను అందించనున్నారు. అయితే ఈ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.