OnePlus 13: హమ్మయ్య ఎట్టకేలకు వచ్చేసిన వన్ ప్లస్ 13 ఫోన్.. ఫీచర్స్ వేరె లెవల్!
తాజాగా చైనా మార్కెట్లోకి వన్ ప్లస్ సంస్థ వన్ ప్లస్ 13 ఫోన్ ని విడుదల చేసింది.
- By Anshu Published Date - 12:36 PM, Sat - 2 November 24

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది వన్ ప్లస్ సంస్థ. ఇది ఇలా ఉంటే వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్ ప్లస్ 13 ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. కంపెనీ ఈసారి ఫోన్‌లో అనేక అప్‌గ్రేడ్‌లు, ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ప్యానెల్ కారణంగా, ఈ ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తోంది.
ఈ ఫోన్‌లో Qualcomm సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, రీడిజైన్ చేసిన కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా కూడా విడుదల కానుంది. కొత్త ఫోన్/256జీబీ వేరియంట్ ధర రూ.53,200గా ఉంది. టాప్ వేరియంట్ 24జీబీ /1టీబీ ని చైనాలో RMB 5,999 అనగా ప్రకారం రూ.70,900 కి కొనుగోలు చేయవచ్చు. అలాగే 12జీబీ /512జీబీ ని RMB 4,899 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.57,900 గా ఉంది. 16జీబీ /512జీబీ వేరియంట్ చైనాలో RMB 5,299 అనగా రూ. 62,600 కి అందుబాటులో ఉంటుంది. OnePlus 12 ప్రారంభ ధర RMB 4,299 అనగా రూ. 50,700 గా ఉంది.
తాజాగా విడుదల చేసిన ఫోన్ లో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. త్వరలో గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఈ సెటప్ ప్రధాన కెమెరాకు 50ఎంపీ LYT808 సెన్సార్, సెకండ్ 50ఎంపీ JN5 సెన్సార్, థర్డ్ పెరిస్కోప్ సెన్సార్. సెల్ఫీ కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరాను కూడా అందించింది. ఈ మొబైల్‌లో 6000mAh జంబో బ్యాటరీని అందించింది. ఇది 100 వాట్ల వైర్డు, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది IP68/IP69 రేటింగ్‌ను కూడా పొందుతుంది. ఇది ఫోన్‌ను నీరు, దుమ్ము సమస్యల నుండి పూర్తిగా సురక్షితంగా ఉంచగలదు. వన్ ప్లస్ 13 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.