WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. మీ చాట్ ని మీరు తప్ప ఎవరూ చూడలేరట?
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్
- By Nakshatra Published Date - 06:30 AM, Wed - 5 April 23
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే సెట్టింగ్స్ విషయంలో స్టేటస్, ప్రొఫైల్, లాస్ట్ సీన్, చాట్ ఇలా అనేక రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుండడంతో వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిపోతుంది.
ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మన ఫోన్ ఎవరైనా తీసుకుంటే వాట్సాప్ చాట్ హిస్టరీ అలాగే చాటింగ్ ఏం చేశాం అన్నది అంతా వాళ్లకు తెలిసిపోతూ ఉంటుంది. ఈ విషయంలో వాట్సాప్ సంస్థ మరో సరి కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాబీటా ఇన్ ఫోలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం లాక్ చాట్ Lock Chat అనే మరో కొత్త ఫీచర్ ని వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. దాంతో యూజర్లు తమ ప్రైవేటు చాట్లను లాక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అంటే తమ వ్యక్తిగత చాట్ హిస్టరీని ఎవరూ చూడకుండా చేసుకోవచ్చు. దీని ద్వారా వ్యక్తిగత ప్రైవసీ, భద్రత మరింత పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లాక్ చాట్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే మీ చాట్ లిస్ట్ లో నుంచి ఏదో ఒక చాట్ ను లాక్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీ వాట్సాప్ ని ఎవరైనా ఓపెన్ చేసినా చాట్ హిస్టరీ ఏమి కనపడదన్నమాట. కేవలం యూజర్ మాత్రమే చూడగలగుతారు. అది చాట్ లాక్ ఓపెన్ కావాలంటే వినియోగదారుని ఫింగర్ ప్రింట్ లేదా పాస్ వర్డ్ అవసరం అవుతుంది. లాక్ చాట్ ఫీచర్ ద్వారా ఇతరులెవరూ లాక్ చేసిన చాట్లను తెరవడం, చదవడం వంటివి చేయడం కుదరదు. ఒక వేళ ఎవరైనా ఫోన్ తీసుకున్నా కూడా లాక్ చేసిన చాట్ లను పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ లేకుండానే చదవాలని ప్రయత్నిస్తే హెచ్చరిస్తుంది. ఆ చాట్ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది. అంతే కాదు లాక్ చేసిన చాట్లో వచ్చిన ఫోటోలు, వీడియోలు ఫోన్ గ్యాలరీలో నేరుగా సేవ్ కావని వాబీటాఇన్ ఫోలో పేర్కొన్నారు. కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటాలో పరీక్షిస్తున్నారు. ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలీదు.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.