Hyundai: హ్యుందాయ్ 2023 కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు.. అద్భుతమైన ఫీచర్లతో అలా?
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో భారత్ లోకి కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ను
- By Nakshatra Published Date - 07:00 AM, Thu - 29 December 22
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో భారత్ లోకి కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ను ప్రవేశపెట్టనుంది. ప్రారంభ తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ ఇది 2023 మధ్య నాటికి వస్తుందని అంచనా. ఇకపోతే ఇప్పుడు మనం కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కీలక ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.. ఇందులోని లోపల భాగంలో చాలా మార్పులు చేశారు. కొత్త క్రెటా గతంలో వచ్చిన టాక్సన్ను పోలి ఉండే బ్రాండ్ అని తెలుస్తోంది. అయితే కొత్త పారామెట్రిక్ గ్రిల్‌ని కలిగి ఉన్న భారీ రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లో చూడవచ్చు. గ్రిల్ పూర్తి వెడల్పుకు విస్తరించి ఉంటుంది.
అంతేకాకుండా ఇంతక ముందే కంటే ఎక్కువగా దీర్ఘచతురస్రాకారంలో కనిపించే హెడ్‌ల్యాంప్‌లు బంపర్ దిగువ భాగంలో అందించారు. అలాగే ఇందులో వెనుక భాగంలో రెండు నిలువు మడతలు కలిగి ఉన్న పదునైన టెయిల్ ల్యాంప్‌లను కూడా అందించారు. కాగా ఇందులో డ్యాష్‌బోర్డ్ డిజైన్ ప్రస్తుత మోడల్‌కు సమానంగా ఉన్నప్పటికీ, కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందించారు SUV అప్ గ్రేడ్ చేసిన హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీతో వస్తుంది. ఇది వాలెట్ పార్కింగ్ మోడ్, స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్, స్టోలెన్ వెహికల్ ఇమ్మొబిలైజేషన్ వంటి కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోంది.
కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 1.4L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో కొనసాగుతుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT, ఒక CVT, iMT యూనిట్ ఉంటాయి. నవీకరించబడిన క్రెటా మోడల్ లైనప్ కూడా CNG ఇంధన ఎంపికతో కూడా వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త క్రెటాలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ తాకిడి, బ్లైండ్ స్పాట్ మానిటర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ ఎగవేత వంటి ఫీచర్లు ఉన్న అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అమర్చబడింది. అయితే, ADAS సూట్ టాప్-ఎండ్ ట్రిమ్‌లో మాత్రమే అందించబడుతుంది.
Tags
Related News
Volkswagen: పాత మోడల్ కారును భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్న వోక్స్వ్యాగన్!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తన పాత మోడల్ టైగన్ 1.0 TSI GT లైన్ ఎడిషన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.