Net Work Issue: ఫోన్ లో పదేపదే నెట్ వర్క్ సమస్య వస్తోందా.. ఇది ఇలా చేయండి?
మాములుగా మనం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వంటివి చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు నెట్వర్క్ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయం
- Author : Anshu
Date : 18-06-2024 - 9:41 IST
Published By : Hashtagu Telugu Desk
మాములుగా మనం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వంటివి చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు నెట్వర్క్ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది ఇది రీ ఫ్రెష్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తరచూ ఈ నెట్వర్క్ సమస్య వస్తూనే ఉంటుంది. కొంతమంది వెంటనే కంపెనీలకు కాల్ చేసి కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇలాగే సమస్య వస్తూ ఉంటుంది. అయితే మరి అలాంటిప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కవరేజీ బాగా లేని ప్రదేశంలో ఉంటే సిగ్నల్ వీక్ కారణంగా నెట్‌వర్క్ సమస్యలు సాధారణంగా సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు మీ ఫోన్ స్థిరమైన కనెక్షన్ మెయింటెయిన్ చేయడానికి కష్టపడవచ్చు. అయితే అలాంటి పరిస్థితిలో మెరుగైన సిగ్నల్ బాగా వచ్చే ప్రదేశానికి వెళ్లవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు కిటికీ దగ్గరకు వెళ్లడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది ఒకే నెట్వర్క్ ను ఉపయోగిస్తున్నప్పుడు కూడా నెట్‌వర్క్ రద్దీ ఉంటుంది. దీని కారణంగా కనెక్షన్ స్లో అవడం జరుగుతుంది.
కచేరీలు, క్రీడా కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితుల వంటి రద్దీ ప్రదేశాలలో ఇది సర్వసాధారణం. ఈ సమస్యను అధిగమించడానికి మీరు Wi-Fiకి మారవచ్చు. WiFi లేకపోతే, మీరు తక్కువ డేటాను ఉపయోగించే యాప్‌లను ఉపయోగించవచ్చు. అలాగే ఫోన్ సరైన పనితీరు కోసం ఫోన్ సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ ది ఉండటం ముఖ్యం. పాత సాఫ్ట్‌వేర్‌ని కలిగి ఉండటం వలన నెట్‌వర్క్ సేవలతో అనుకూలత సమస్యలు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి దాన్ని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడు అందుబాటులో ఉంటే అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. అలాగే పాత, పాడైపోయిన కార్డుల వల్ల కూడా ఈ నెట్‌వర్క్ సమస్యలు రావచ్చు. లేదా సిమ్ ను తప్పుగా అమర్చినప్పటికీ, ఫోన్‌ను నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీకు ఏదైనా సమస్య అనిపిస్తే సిమ్‌ని తీసి అది తప్పుగా అమర్చబడి ఉంటే అది సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.