Auto Expo 2023: మార్కెట్ లోకి ఒకేసారి అన్ని కీవే బైక్స్ విడుదల.. ఫీచర్స్ ఇవే?
దేశవ్యాప్తంగా వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా బైక్స్ కొనుగోలుదారుల సంఖ్య
- By Nakshatra Published Date - 07:30 AM, Fri - 20 January 23
దేశవ్యాప్తంగా వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా బైక్స్ కొనుగోలుదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అంటే చాలామంది బైక్స్ ని సెల్ ఫోన్ కొనుగోలు చేసినంత ఈజీగా కొనుగోలు చేయడం సిమ్ కార్డ్ మార్చినంత ఈజీగా బైక్స్ ని మార్చేయడం లాంటివి చేస్తున్నారు. దాంతో సిటీలలో అయితే ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు బైకులు కూడా కనిపిస్తూ ఉంటాయి. బైట్స్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో ఆయా కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్త కొత్త బైక్స్ తీసుకొస్తున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2023 లో తమ కొత్త బైక్స్ వివరాలను పంచుకుంటున్నాయి.
కాగా ఇదే తరహాలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ కివే తన కొత్త బైక్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కీవే ఎస్ ఆర్ 125, సిక్స్టీస్ 300ఐ, విస్టీ 300 ఈ, కె లైట్ 250 వి, కె 300 ఎన్, కె 300 ఆర్ వంటి 6 కీవే బైక్ లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మరి ఆ ఆరు బైకుల ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కీవే ఎస్ఆర్ 125.. ఈ మోడల్ బైక్ ను ధర రూ.1.29 లక్షలుగా ఉంది. ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 125 సీసీ ఎస్ ఓ హెచ్ సీ ఇంజిన్, సింగిల్ సిలిండర్, 4స్ట్రోక్ 9.7 గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ సిస్టిమ్ తో వస్తుంది. సూపర్ సస్పెన్షన్ తో పాటు వెనుక వైపు డిస్క్ బ్రేక్ తో లభిస్తోంది.
కీవే విస్టే 300.. ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రూ. 2.99 లక్షలుగా ఉంది. హంగేరియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కీవే విస్టే 300 స్కూటర్‌తో భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. కీవే కే లైట్ 250 వీ.. ఈ బీకే విషయానికి వస్తే.. దీని ధర రూ. 2.89 లక్షలుగా ఉంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్ తో, ఇది వీ ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. అలాగే ఇండియా లోనే తొలి క్వాటర్ లీటర్ క్రూయీజ్ మోటర్ సైకిల్. ఈ మోటర్ సైకిల్ 18.5 బీహెచ్ పీ పవర్ తో నడుస్తుంది.అయితే ఈ మోడల్ బైక్ ను బుక్ చేసుకోవాలంటే రూ.10000 చెల్లించాలని కంపెనీ పేర్కొంది. కీవే కె 300 ఎన్- కీవే కె 300 ఆర్
ఈ బైక్స్ పూర్తిగా ఫెయిర్ గా ఉంటుంది. 292 సీసీ తో వచ్చే ఈ బైక్ నడవడానికి 27 బీహెచ్ పీ పవర్ అవసరం. కాగా ఈ బైక్ ధర రూ.2.65 లక్షలు గా ఉంటుంది. ఈ బైక్ ని ముందుగానే బుక్ చేయాలంటే రూ. 35000 కట్టాలని కంపెనీ తెలిపింది.
Related News
Auto Expo 2023: కీవే రెట్రో బైక్ ఎస్ఆర్ 250.. ధర, ఫీచర్స్ ఇవే?
రోజురోజుకి దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి ఇంట్లో కనీసం రెండు