Electric Rice Cooker: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా? ఈ విషయాలు వెంటనే తెలుసుకోండి!
అప్పట్లో వంట చేయాలి అంటే కట్టెల పొయ్యిపై చేసేవారు. అలాగే అన్నం చేయాలి అంటే ఒక గంట ముందే బియ్యం నానబెట్టేవారు. బియ్యం బాగా నానిన తర్వాత అన్నం చేసి గింజిని వంపేసి, ఆ తర్వాత గింజిని కూడా తాగేవారు.
- By Anshu Published Date - 07:46 AM, Tue - 30 August 22

అప్పట్లో వంట చేయాలి అంటే కట్టెల పొయ్యిపై చేసేవారు. అలాగే అన్నం చేయాలి అంటే ఒక గంట ముందే బియ్యం నానబెట్టేవారు. బియ్యం బాగా నానిన తర్వాత అన్నం చేసి గింజిని వంపేసి, ఆ తర్వాత గింజిని కూడా తాగేవారు. అయితే రాను రాను కట్టెల పోయిలు కాస్త పోయి గ్యాస్ స్టవ్ లు వచ్చాయి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ లలోని రకరకాలుగా మోడల్స్ వచ్చాయి. ఇక టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ని వాడుతున్నారు. ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లు దర్శనమిస్తున్నాయి.
బిజీ బిజీ లైఫ్ లో అన్నం చేసుకోవడానికి కూడా సమయం లేక బియ్యం కడిగేసి అందులో పెట్టడం వల్ల తొందరగా అన్నం అయిపోతుంది. అందులో పెట్టడం వల్ల కనీసం గంజిని వంచే అవసరం కూడా ఉండదు. ఇదివరకు కేవలం పట్టణాలలో ఉండే వారు మాత్రమే ఈ రైస్ కుక్కర్ లో ఉపయోగించేవారు. కానీ రాను రాను ఈ రైస్ కుక్కర్ లను పల్లెటూర్లలో వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే పని తొందరగా అయిపోతుంది అని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండుకుంటున్నారు కానీ, ఆ రైస్ కుక్కర్ లో వండుకున్న అన్నాన్ని తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
మరి రైస్ కుక్కర్లో వండిన ఆహరం తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తినడం వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు,మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సీన్ మెటల్ తో తయారవుతుంది. ఇక ఇందులో అన్నాన్ని ఉడికించడం వల్ల అందులో ఉన్న పోషకాలు కనుమరుగవుతాయి. అయితే నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న కుక్కర్లను వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నాన్ స్టిక్ వస్తువులను ఉపయోగించి వంట చేయడం వల్ల అందులో నుంచి కెమికల్స్ విడుదల అవుతాయి.
తద్వారా అవి క్యాన్సర్ కి కూడా దారితీస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కలను వాడకపోవడం మంచిది. అయితే అన్నం తొందరగా ఉండాలి అనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం ఆరోగ్యానికి కూడా మంచిది. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. అన్నం చేయడం కోసం మట్టి పాత్రలు లేదా స్టీల్ పాత్రలను ఉపయోగించడం మేలు. ఇంకా చెప్పాలి అంటే మట్టి పాత్రలో అన్నం చేయడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి.