Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
ప్రముఖ కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఇప్పటికే పలు రకాల కార్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన
- By Nakshatra Published Date - 11:00 PM, Tue - 6 September 22
ప్రముఖ కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఇప్పటికే పలు రకాల కార్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మార్కెట్ లోకి మరొక కొత్త కారుని సెప్టెంబర్ ఆరవ తేదీన విడుదల చేసింది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్యూవీ తర్వాత, స్పోర్టీ అవతార్‌లో హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ను విడుదల చేసింది. కాగా ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉండగా, స్పోర్టీ ఎస్‌యూవీకి సంబంధించి ఇండియాలో రూ. 21వేలతో బుకింగ్‌లను కూడా ప్రారంభించడం జరిగింది.
ఇక హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఇంజీన్,ఫీచర్ ల విషయానికి వస్తే.. 1.0 కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. అలాగే 2వ జెన్ 7స్పీడ్ డిసిటితో వస్తున్న ఈ ఇంజీన్ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 88.3 kw , 172 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుందట. అంతే కాకుండా డ్యూయల్ కెమెరాతో ప్రత్యేకమైన డాష్ క్యామ్ ను కూడా అందిస్తోందట. అలెక్సా , గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో హోమ్ టు కార్ (H2C)ని కూడా కలిగి ఉంటుంది.
అలాగే కస్టమర్లకు సాధారణ, ఎకో, స్పోర్ట్ మోడ్ల మధ్య ఎంచుకోవడానికి వీలు కల్పించే డ్రైవ్ మోడ్ ఎంపికను కూడా ఆఫర్ చేస్తోంది.హ్యుందాయ్ వెన్యూ ఎన్ ధరల విషయానికి వస్తే.. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఎన్6, ఎన్8 అనే అనే రెండు వేరియంట్ లలో లభ్యం అవుతుందట. కాగా ఈ ఎన్ 6 వేరియంట్ ధర రూ. 12.16 లక్షలు. ఇక ఎన్8 వేరియంట్ ధర రూ. 13.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
Tags
Related News
Hyundai Creta: మార్కెట్లోకి వచ్చిన మూడు నెలలకే ఆ కారు ధరలను పెంచిన హ్యుందాయ్..!
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల తన కొత్త SUV క్రెటా (Hyundai Creta)ను భారతదేశంలో విడుదల చేసింది. వినియోగదారులు కొత్త మోడల్‌ను చాలా ఇష్టపడుతున్నారు.