Nothing Offers: పండుగ వేళ అద్భుతమైన ఆఫర్స్.. ఆ కంపెనీ స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
ఫెస్టివల్ సీజన్ లో భాగంగా నథింగ్ ఫోన్ సంస్థ కొన్ని స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
- By Anshu Published Date - 11:30 AM, Thu - 26 September 24

తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా, అయితే ఈ ఆఫర్స్ మీకోసమే. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కావడంతో కొన్ని రకాల కంపెనీలు ఆయా స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే నథింగ్ కంపెనీ తన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ అందజేస్తుంది. నథింగ్ ఫోన్ 2 (ఏ), సీఎంఎఫ్ వాచ్ ప్రో, సీఎంఎఫ్ ఫోన్ 1 పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. రిటైల్ షోరూమ్ లతో పాటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.
మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నథింగ్ 2 (ఎ) ఫోన్ ను రూ. 18,999కి కొనుగోలు చేసుకోవచ్చు. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ లతో పాటు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఆకట్టుకుంటున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.
అలాగే ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ లో నథింగ్ ఫోన్ (2ఎ) ప్లస్ ఫోన్ పై కూడా తగ్గింపు ప్రకటించారు. దీన్ని రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ తో పాటు ఎంపిక చేసిన రిటైల్ షాపులలో అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 6.7 అంగుళాల ఎఫ్ హెడ్ డీ ప్లస్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7350 చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.
అలాగే ఈ పండుగ ఆఫర్లో భాగంగా సీఎంఎఫ్ ఫోన్ 1 కేవలం రూ.12,999కి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ తో పాటు ఎంపిక చేసిన ఫోరూమ్ లలో కొనసాగుతుంది. ఈ ఫోన్ లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 16 జీబీ స్టోరేజీ, మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తదితర వాటిని ఏర్పాటు చేశారు.