Huawei Nova Y61 Price: మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ఫోన్.. ఫీచర్లు, ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం
- By Nakshatra Published Date - 06:32 PM, Tue - 1 November 22
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. హువావే సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. తాజాగా మార్కెట్ లోకి తీసుకువచ్చిన ఆ మొబైల్ పేరు హువావే నోవా వై61. కంపెనీ గ్లోబల్ వెబ్ సైట్లో ఈ స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయ్యింది. ఇది వరకే మార్కెట్ లోకి విడుదల అయిన నోవా వై60 ఫోన్ కు అప్గ్రేడ్ వెన్షన్ అని చెప్పవచ్చు. కాగా కంపెనీ ఈ ఫోన్ ధర లభ్యత లాంటి విషయాల గురించి ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలు ఫీచర్లను వెల్లడించింది..
తాజాగా విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అధిక బ్యాటరీ సామర్థ్యాన్ని అనగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే 50 ఎంపీ రియర్ కెమెరా కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ రియర్ లుక్ చూస్తే లేటెస్ట్ ఐఫోన్ ప్రో మోడళ్ల లాగే ఉంది. అంతే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆసియా ఫసిఫిక్ లాంటి దేశాలలో అయితే కంపెనీ 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ను అందుబాటులో ఉంచింది.
ఈ ఫోన్లో ఎటువంటి ప్రాసెస్ కలిగి ఉందో అన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ కెమెరాతో పాటుగా 2 ఎంపీ మ్యాక్రో, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఎప్పటి నుంచి కస్టమర్ లకు అందుబాటులో ఉంటుంది అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగు లలో లభించనుంది.
Related News
5G Network Issue : 5జీ ఫోన్లో నెట్వర్క్ ఇష్యూ ఉందా ? పరిష్కారాలు ఇవిగో
5G Network Issue : ఇటీవల కాలంలో 5జీ స్మార్ట్ఫోన్లు కొనేవారి సంఖ్య బాగా పెరిగింది.