WhatsApp: ఆండ్రాయిడ్ టు ఐఫోన్ వాట్సాప్ డేటా ట్రాన్స్ఫర్ ఇప్పుడు మరింత ఈజీ!
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు వాట్సాప్ డేటాను బదిలీ చేసుకునేందుకు ఇప్పుడు మరొక అవకాశాన్ని కల్పించింది వాట్సాప్.
- By Anshu Published Date - 10:30 AM, Thu - 22 August 24

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. మొబైల్ ఫోన్ ఉంది అంటే అందులో ఖచ్చితంగా వాట్సాప్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలా రోజు కోట్లాదిమంది ఈ వాట్సాప్ వినియోగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్లను తెగ మారుస్తూ ఉంటారు. ఫోన్ పగిలిపోయిందని బాగాలేదని స్ట్రక్ అవుతోందని ఇలా అనేక కారణాల వల్ల మొబైల్ ఫోన్లను తెగ మారుస్తూ ఉంటారు. ఏడాదికి కనీసం రెండు మూడు మొబైల్స్ మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలా మొబైల్ ఫోన్లు మార్చినప్పుడు పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కు వాట్సాప్ చాట్ లను పంపించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.
దీని కారణంగా ఫోన్ వినియోగదారులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈ సమస్యకు మెటా చాలా సులువైన పరిష్కారం చూపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్ కు మారుతున్న వినియోగదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. వాట్సాప్ చాట్ లను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా బదిలీ చేసుకోవచ్చట. మెటా తీసుకువచ్చిన కొత్త విధానంతో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ కు మారే యూజర్లకు చాలా ఉపయోగం కలుగుతుంది. చాలా సులువుగా బదిలీ చేసుకునే వీలు కలిగింది. వాట్సాప్ నుంచి మీడియా, చాట్ లను బదిలీ చేయాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. అలాగే కొత్తగా తీసుకున్న ఐఫోన్ లో ఐఓఎస్ 15.5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టాల్ చేయాలి. వీటితో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మూవ్ టు ఐఓఎస్ అప్లికేషన్ ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కు వాట్సాప్ డేటా బదిలీ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇది మీ వాట్సాప్ లో ఉన్న బ్యాకప్ పై సమయం ఆధారపడి ఉంటుంది. ముందుగా రెండు ఫోన్లనూ పవర్ సోర్స్ లో ప్లగ్ చేసి ఉంచాలి. లేకపోతే స్మార్ట్‌ఫోన్ లో కనీసం 60 శాతం బ్యాటరీ చార్జింగ్ అవసరం. మీ రెండు పరికరాలను ఒకే వైర్‌లెస్ నెట్‌వర్క్ కు కనెక్ట్ చేయాలి. లేకపోతే ఐఫోన్ అనుకూల హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కి ఆండ్రాయిడ్ ఫోన్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో మూవ్ టు ఐఓఎస్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్క్రీన్ పై వచ్చే రూల్స్ ని అనుసరించాలి. కోడ్ గురించి అడిగినప్పుడు మీ ఐఫోన్ లో కనిపించిన కోడ్‌ని నమోదు చేయాలి. కంటిన్యూ అండ్ ఫాలో ద ఆన్ స్క్రీన్ ఇన్ స్ట్రక్షన్స్ అనే దానిపై ట్యాబ్ పై క్లిక్ చేయాలి. బదిలీ డేటా స్క్రీన్ లో వాట్సాప్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ లో స్టార్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. డేటా ట్రాన్స్ ఫర్ చేయడానికి వాట్సాప్ కోసం వేచి ఉండాలి. తర్వాత నెక్ట్స్ బటన్ పై నొక్కి, కంటిన్యూ పై క్లిక్ చేయాలి. బదిలీ కోసం వెయిట్ చేయాలి. తర్వాత, మీ ఐఫోన్ లో వాట్సాప్ యాప్ ను తెరిచి, మీ రిజిస్టర్డ్ నంబర్ తో లాగిన్ అవ్వాలి.
అనంతరం స్టార్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, డేటా బదిలీ అయ్యే వరకూ వేచి ఉండాలి.