Mobile Sound Problem: మీ మొబైల్ ఫోన్ లో సౌండ్ సరిగ్గా వినిపించడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి?
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉ
- By Anshu Published Date - 11:24 AM, Mon - 10 June 24

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ మొబైల్ ఫోన్లకు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పవచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్ ల వాడకం పెరిగిపోవడంతో పాటు వాటి సమస్యలు కూడా పెరిగిపోయాయి. దీంతో మొబైల్ ఫోన్ కి సంబంధించి తరచూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అందులో ఎక్కువ శాతం మంది ఫేస్ చేసే ప్రాబ్లం సౌండ్ సరిగ్గా రాకపోవడం.
ఫోన్ చేసినప్పుడు వాయిస్ సరిగా వినిపించకపోవడం, మూవీస్ లాంటివి చూస్తున్నప్పుడు వాయిస్ తక్కువగా వినిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో చాలామంది ఏం చేయాలో తెలియక వెంటనే మొబైల్ రిపేర్ షాప్ లకు వెళుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు మొబైల్ షాపులకు వెళ్లకుండానే కేవలం కొన్ని సెకండ్లలోనే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా సార్లు మనం అనుకోకుండా ఫోన్ వాల్యూమ్ తగ్గిస్తాం లేదా మ్యూట్ చేస్తాము. కాబట్టి సౌండ్ తక్కువగా వచ్చినప్పుడు మొదట మీరు మీ ఫోన్ వాల్యూమ్ సెట్టింగ్ లను చెక్ చేయాలి. వాల్యూమ్ బటన్ లను ఉపయోగించి వ్యాల్యూమ్ ను పెంచుకోవడానికి ట్రై చేయాలి. అలాగే కొంతమంది కొన్ని కొన్ని సార్లు డోంట్ డిస్టర్బ్ మోడ్ లో ఆన్ చేసి మరిచిపోతూ ఉంటారు.
అలాంటప్పుడు వెంటనే దానిని ఆఫ్ చేయాలి. కొన్నిసార్లు ఫోన్ స్వయంచాలకంగా హ్యాండ్స్-ఫ్రీ మోడ్‌లోకి వెళుతుంది. మీ ఫోన్ ఈ మోడ్‌లో లేదని చెక్ చేయండి. అదేవిధంగా మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి సౌండ్ లేదా వాయిస్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇక్కడ సౌండ్ ప్రొఫైల్ ని తనిఖీ చేసి, దాన్ని రీసెట్ చేయాలి. అయినా కూడా ప్రాబ్లం వస్తుంటే.. పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ల వల్ల కొన్నిసార్లు ధ్వని సమస్యలు కూడా సంభవించవచ్చు. మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి సిస్టమ్ అప్‌డేట్ చెక్ చేసుకోవడం మంచిది. అలాగే అందుబాటులో ఉంటే ఏవైనా అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.అలాగే ఫోన్ సెట్టింగ్‌లకి వెళ్లి అప్లికేషన్స్ లేదా యాప్‌లు ఎంపికకు వెళ్లి ఫోన్ లేదా డయలర్ యాప్‌ని ఎంచుకుని, కాష్‌ను క్లియర్ చేయాలి. హెడ్‌ఫోన్ జాక్… మీరు హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తుంటే, అవి సరిగ్గా కనెక్ట్ అవుతున్నాయో లేదో తనిఖీ చేయాలి. పైన చెప్పిన సెట్టింగ్స్ అన్నీ మార్చినా కూడా అదే విధంగా సమస్య వస్తుంటే అది హార్డ్‌వేర్ సమస్య కావచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఫోన్‌ను సమీపంలోని సేవా కేంద్రానికి చూపించాలి.