Whatsapp: వాట్సాప్ పేలో ఇలా బ్యాంక్ అకౌంట్ యాడ్ చెయ్యండి.. పూర్తి వివరాలు!
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వాట్సాప్ సంస్థ వారు వినియోగదారుల ఆలోచనలను
- By Anshu Published Date - 10:27 PM, Wed - 17 August 22

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వాట్సాప్ సంస్థ వారు వినియోగదారుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇండియాలో వాట్సాప్ పే ప్రారంభం అయిన తరువాత వాట్సాప్ యూసర్లు యాప్ లోనే యూపీఐ సేవల్ని పొందగలుగుతున్నారు. ఈ యూపీఐసీల కోసం మరొక యాప్ ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ లో పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వాట్సాప్ పే ద్వారా స్నేహితులకు కుటుంబ సభ్యులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు యూపీఐ పేమెంట్స్ కూడా ఈజీగా చేసేస్తున్నారు. అయితే వాట్సప్ పేలో బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి? ఇప్పటికే లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను వాట్సప్ పే నుంచి ఎలా తొలగించాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే వాట్సాప్ పేలో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడానికి ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి పైన ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి పైమెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తరువాత సెండ్ పేమెంట్ , స్కాన్ పేమెంట్,క్యూఆర్ కోడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ రెండు ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయొచ్చు. యాడ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే బ్యాంక్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులోంచి మనది ఏ బ్యాంకో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెరి ఫై చేయాలి. అలాగే ముఖ్యంగా మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌కు లింకై ఉండాలి. ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది.
ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి యాడ్ చేయొచ్చు. వాట్సాప్ ఛాట్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ముందుగా వాట్సప్ ఓపెన్ చేసి ఎవరికి డబ్బులు పంపాలో వారి ఛాట్ ఓపెన్ చేయాలి. అందులో ₹ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎంత చెల్లించాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ నీ ఎంటర్ చేయాలి. వాట్సాప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అంగీకరించాలి. వేర్వేరు బ్యాంక్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులోంచి మీ బ్యాంకు సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వెరిఫై చేయాలి. మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌కు లింకై ఉండాలి. ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది.