HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Has Anyone Sent A Message On Whatsapp And Deleted It Immediately Find Out What That Message Is

Tech Guide : వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్ ఏంటో ఇలా తెలుసుకోండి!!

వాట్సాప్‌లో ఎవరైనా మీకు మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్‌లను చదవాలను కుంటున్నారా? ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ అయిన ఆ మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు.

  • By hashtagu Published Date - 07:47 AM, Sat - 1 October 22
  • daily-hunt
Whats App
Whats App

వాట్సాప్‌లో ఎవరైనా మీకు మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్‌లను చదవాలను కుంటున్నారా? ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ అయిన ఆ మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు. వాట్సాప్ లో ఇప్పటికే మెసేజ్ డిలీటెడ్ ఫీచర్ ఉంది. యాప్‌లోని ఏదైనా మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత కూడా డిలీట్ చేసేందుకు ప్లాట్‌ఫారమ్ యూజర్లను అనుమతిస్తుంది. మెసేజ్ డిలీట్ చేసినట్టుగా రిసీవర్‌కు తెలిసేలా యాప్ చాట్‌లో ” డిలీటెడ్ ” అనే మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఇంతకీ వాట్సాప్‌లో ఏ మెసేజ్ పంపారు? ఎందుకు డిలీట్ చేశారు అనేది తెలియకపోవచ్చు. ఆ మెసేజ్ ఏమై ఉంటుంది అనేది ప్రతిఒక్కరికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

తప్పిదాన్ని గుర్తించిన తర్వాత మళ్లీ మెసేజ్

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ “Delete Message” ఫీచర్‌ను అందిస్తున్నాయి. యాప్ డిలీట్ చేసిన మెసేజ్ గురించి రిసీవర్‌ని ఎప్పటికీ అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది? పంపిన మెసేజ్ ఏమిటి? ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? అనేది వివరించాల్సిన అవసరం లేదని వాట్సాప్ అభిప్రాయం. యూజర్లు పంపిన మెసేజ్ తప్పిదాన్ని గుర్తించిన తర్వాత మళ్లీ మెసేజ్ పంపడానికి WhatsApp ఈ ఫీచర్‌ను అందించింది.

ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి

మీరు ఈ వాట్సాప్ ఫీచర్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్నారా? మీకు ఇతరులు పంపి డిలీట్ చేసిన అన్ని మెసేజ్‌లను చదవాలనుకుంటున్నారా? ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ చేసిన మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు Google Play Store ద్వారా థర్డ్ పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ అదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డిలీట్ మెసేజ్‌లను ఇలా చూడొచ్చు

* Google Play Store నుంచి ”Get Deleted Messages” యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

* మీరు ఇప్పుడు యాప్‌కి కొన్ని Allow పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

* WhatsAppలో మెసేజ్ డిలీట్ చేసినప్పుడల్లా మీరు ఈ యాప్ ద్వారా ఆ మెసేజ్ ఏంటో చూడవచ్చు.

* థర్డ్ పార్టీ యాప్ మీ ఫోన్ నోటిఫికేషన్‌ల ప్యానెల్ నుంచి ఏదైనా పంపినవారి మెసేజ్‌లను ట్రాక్ చేస్తుంది. ఆపై మీకు ఆ మెసేజ్ కూడా చూపిస్తుందని గుర్తించుకోండి.

* మీరు నోటిఫికేషన్‌లకు Allow ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఒక యూజర్ WhatsApp చాట్‌ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఏదైనా మెసేజ్ డిలీట్ అయితే మీరు చదవలేరని గుర్తించుకోండి.

* ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యాప్ మీ WhatsAppలో ఉన్న వెంటనే నోటిఫికేషన్ నుంచి మెసేజ్‌లను డిస్‌ప్లే చేస్తుంది. మెసేజ్‌లు డిలీట్ అయిన తర్వాత అవి WhatsAppలో కనిపించవు.

* కానీ, మీరు వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను “Get Deleted Messages” యాప్‌లో మాత్రం చూడవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deleted messages
  • tech tips
  • whatsapp

Related News

    Latest News

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd