Google Pixel 9: ఆసక్తిని పెంచేస్తున్న గూగుల్ పిక్సెల్ 9 లీక్డ్ ఫీచర్స్.. లాంచ్ అయ్యేది అప్పుడే?
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ను లాంచ్ చేయనున్న
- By Anshu Published Date - 08:00 PM, Fri - 26 January 24

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ను లాంచ్ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ తర్వాత ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ కానుందని, ఆ తర్వాత భారత్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కొత్త ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? ఈ ఫోన్ ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అన్న వివరాల్లోకి వెళితే.. గూగుల్ పిక్సెల్ నుంచి కొత్త ఫోన్‌లను ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌లను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.
అయితే గూగుల్ ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్ అవుతున్నాయి. మార్కెట్ లో వైరల్ అవుతున్న ఆ ఫీచర్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని లాంచ్ చేయనున్న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ను అందించనున్నారు. గూగుల్ పిక్స్‌ల్ 9, 9 ప్రో పేరుతో రెండు స్మార్ట్ ఫోన్‌లను ఈ సిరీస్‌లో భాగంగా లాంచ్ చేయనున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..
ఇందులో డైమెన్షన్స్‌ను 360 డిగ్రీ వీడియోలో ఆవిష్కరించే 5కే రెండర్స్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 6.5 ఇంచ్ ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ డివైజ్ ఫ్లాట్ ప్రేమ్ ఇవ్వనున్నట్లు సమాచారం. డివైజ్ కింది భాగంలో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు.