HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Google Launches Startup School India Targets 10000 Startups In Small Cities

Google : ఇండియాలో గూగుల్ “స్టార్టప్‌ స్కూల్‌”

స్టార్టప్ ల హబ్ గా ఇండియా మారుతోంది. అయితే చాలా స్టార్టప్ లకు ప్రారంభ దశలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.

  • Author : Hashtag U Date : 08-07-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google Schools
Google Schools

స్టార్టప్ ల హబ్ గా ఇండియా మారుతోంది. అయితే చాలా స్టార్టప్ లకు ప్రారంభ దశలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ ముందుకు వచ్చింది. స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మన దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్‌గా తొమ్మిది వారాల పాటు ఉంటుంది.

ఏం నేర్పిస్తారు ?

* స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా కార్యక్రమం ద్వారా మెరుగైన ఉత్పత్తిని సమర్థంగా రూపొందించేందుకు వ్యూహాలు అందిస్తారు.
* కొత్తగా ఇంటర్నెట్‌కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్‌ల రూపకల్పన చేస్తారు.
* కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలు ఇస్తారు.
* ఈ అంశాలతో పాటు మొదలైన వాటిలో ట్రైనింగ్ ఇస్తారు.
* స్టార్టప్‌ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* ఖర్చులపై అదుపు లేకపోవడం, డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, సారథ్యం సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల స్టార్టప్ లు చతికిల పడుతున్నాయి. ఈ అంశాల్లో ఎలా వ్యవహరించాలనేది అవగాహన కల్పిస్తారు. తద్వారా అవి నిలదొక్కుకునేందుకు నైతిక స్థైర్యం ఇస్తారు.

90 శాతం స్టార్టప్‌లు ఐదేళ్లలోనే బంద్..

దాదాపు 70,000 పైచిలుకు అంకుర సంస్థలతో స్టార్టప్‌ల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ , బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అనేకానేక స్టార్టప్‌లు వస్తున్నాయి. అయితే, 90 శాతం స్టార్టప్‌లు తొలి అయిదేళ్లలోనే మూతబడుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • google
  • Start Ups

Related News

Google India

భారత్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌… 20,000 మందికి ఉద్యోగాలు

Google  భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

    Latest News

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

    • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

    • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    Trending News

      • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

      • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

      • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

      • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

      • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd