Google Maps: గూగుల్ మ్యాప్స్ తో ఇంధనాన్ని సేవ్ చేసుకోవచ్చు.. అదెలా అంటే?
ప్రస్తుత రోజుల్లో గూగుల్ మ్యాప్స్ వినియోగం ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సిటీ ప్రాంతాలలో ఎక్కువగా గూగుల్ మ్యాప్స్ ని వినియోగ
- By Nakshatra Published Date - 07:50 PM, Fri - 15 December 23
ప్రస్తుత రోజుల్లో గూగుల్ మ్యాప్స్ వినియోగం ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సిటీ ప్రాంతాలలో ఎక్కువగా గూగుల్ మ్యాప్స్ ని వినియోగిస్తున్నారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడ్రస్ సరిగా తెలియని సమయంలో ఈ గూగుల్ మ్యాప్స్ పైన ఆధారపడుతున్నారు. యూజర్ల సంఖ్య పెరిగిపోతుండడంతో గూగుల్ మ్యాప్స్ కూడా యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఫ్యూయల్ సేవింగ్ పేరుతో మ్యాప్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను తాజాగా భారత్‌లోకి కూడా తీసుకొచ్చారు. గూగుల్ మ్యాప్స్‌లో ఉండే ఫ్యూయల్ సేవింగ్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. మనం వెళ్లే దారిలో లైవ్ ట్రాఫిక్ అప్డేట్తో పాటుగా రహదారులు, ట్రాఫిక్ పరిస్థితులు, ఇంధన సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తుంది. గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో వాహన స్పీడ్, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకొని అందుకు అనుకూలమైన మార్గాన్ని చూపిస్తుంది.
అంతేకాకుండా ఆ రూట్ లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ పొదుపు చేయవచ్చో కూడా గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి నేవిగేషన్ సెట్టింగ్స్ ఎంచుకొని, కిందకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే రూట్ ఆప్షన్ అనే ట్యాబ్ లో ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి.అలాగే మీ వాహనం ఇంజిన్, ఫ్యుయల్ రకం సెలక్ట్ చేసుకోవాలి. నేవిగేషన్ ట్యాబ్‌లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతో పాటు మీరు వెళ్లే రూట్లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చూపుతుంది.
Related News
Google Maps : న్యూ ఇయర్లో గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఫీచర్స్
Google Maps : గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఇయర్ 2024లో కొత్తకొత్త ఫీచర్లు, అప్డేట్స్ రానున్నాయి.