Passphrases : ఫుల్ సెక్యూరిటీ కావాలా ? ‘పాస్‌వర్డ్’ బదులు ‘పాస్‌ఫ్రేజ్’ వాడండి!
పాస్‌వర్డ్ గురించి మనకు తెలుసు. వివిధ ఆన్‌లైన్ లాగిన్ అవసరాల కోసం మనమంతా పాస్‌వర్డ్‌లపైనే ఆధారపడుతున్నాం.
- By Pasha Published Date - 10:17 AM, Wed - 22 May 24

Passphrases : పాస్‌వర్డ్ గురించి మనకు తెలుసు. వివిధ ఆన్‌లైన్ లాగిన్ అవసరాల కోసం మనమంతా పాస్‌వర్డ్‌లపైనే ఆధారపడుతున్నాం. ఆన్‌లైన్ బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్లకు కూడా వాటినే వాడుతున్నాం. పాస్‌వర్డ్‌లను మించిన సెక్యూరిటీని అందించే ఒక మార్గం అందుబాటులో ఉంది. అదే ‘పాస్‌ఫ్రేజ్’ (Passphrases)!! దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
‘పాస్‌ఫ్రేజ్’ ఏమిటి ? ఎలా క్రియేట్ చేయాలి ?
- ‘ఫ్రేజ్’ అంటే పదబందం అని అర్థం. ఇది కొన్ని పదాల కలయిక.
- ఒక ఎగ్జాంపుల్‌ను పరిశీలిస్తే.. thats not a big deal అనే ఫ్రేజ్ ఉంది. పాస్ ఫ్రేజ్ తయారీలో భాగంగా మనం దీన్ని లెటర్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్‌లోకి మార్చేయాలి. దీనివల్ల thats not a big deal అనే ఫ్రేజ్ 2081#TON127deaL అనే ఫార్మాట్‌లోకి మారిపోతుంది. దీన్నే leetspeak అని పిలుస్తారు. ఇలా క్రియేట్ చేసిన పాస్ఫ్రేజ్లో not అనే పదాన్ని TON అని మార్చారు. దీనివల్ల హ్యాకర్ మీ ఫ్రేజ్‌ను కనిపెట్టినా.. దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టతరంగా మారుతుంది.
- పాస్ ఫ్రేజ్‌ను సెట్ చేసుకునేటప్పుడు.. మీకు ఈజీగా గుర్తుండే ఫ్రేజ్‌నే ఎంపిక చేసుకోవాలి.
- కొన్ని వైబ్సైట్లు పొడవాటి పాస్‌వర్డ్‌లను సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు ఫ్రేజ్‌లోని మొదటి అక్షరాలను తీసుకుని, వాటితో పాస్ఫ్రేజ్ను క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ కంప్యూటర్లో మనం ఎంత పొడవాటి పాస్ఫ్రేజ్ను అయినా టైప్ చేయొచ్చు. కానీ మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్‌లో వాటికి సపోర్ట్ లభించకపోవచ్చు.
- మీరు పాస్‌వర్డ్ మేనేజర్‌ను వాడుకోవడం బెటర్. దీనికి మీరు ఒక మాస్టర్ పాస్‌వర్డ్‌ను పెట్టుకుంటే చాలు. అది మీ అన్ని పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచుతుంది.
Also Read : Buddha Purnima 2024 : ఇవాళే బుద్ధ పూర్ణిమ.. ఈ వేడుకలో దాగిన గొప్ప సత్యాలు
- ప్రస్తుతం పాస్కీ ఆథెంటికేషన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అందరూ పాస్ వర్డ్‌లపైనే ఆధారపడుతున్నారు.
- కొంతమంది సింపుల్‌గా ఉండే పాస్వర్డ్లు పెట్టి హ్యాకర్లకు దొరికిపోతుంటారు. సైబర్ నేరగాళ్ల ‘డిక్షనరీ ఎటాక్స్’ సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను ఇట్టే కనిపెట్టేస్తాయ్.
- మరికొందరు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను వాడినా.. అన్ని అకౌంట్లలోకీ అదే ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఫిషింగ్ సైట్లలో మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే, దానిని సైబర్ విలన్స్ ఈజీగా కనిపెట్టేస్తారు.
- ఒకవేళ ప్రతి అకౌంట్‌కు వేర్వేరు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకుంటే, వాటిని గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది.