Smart Watch: ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్.. కేవలం రూ.1299కే బెస్ట్ స్మార్ట్ వాచ్?
టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. అందులో
- By Nakshatra Published Date - 08:00 AM, Thu - 22 December 22
టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. అందులో స్మార్ట్ వాచ్ కూడా ఒకటి. ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించే వారిలో ఎక్కువ శాతం మంది స్మార్ట్ వాచ్ ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ స్మార్ట్ వాచ్ మార్కెట్లో వివిధ రకాల మోడల్స్ లో ధరలలో లభిస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటు ధరలో తక్కువ ధరకే లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు భారీ ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తోన్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ.5999 విలువైన స్మార్ట్ వాచ్ ను రూ.4700 భారీ తగ్గింపుతో కేవలం రూ.1299కే కొనుగోలు చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.
అయితే ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ మాదిరి కానీ ఈ స్మార్ట్ వాచ్ కు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడంతో వినియోగదారులు ఎక్కువ శాతం మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ లో ఎన్నో రకాల ఫీచర్ లు కలిగి ఉండడంతో వీటికి ఉన్న క్రేజ్ రోజుకి పెరుగుతూనే ఉంది. చాలామంది స్మార్ట్ వాచ్ అనగానే దాని ధర వేలల్లో ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అతి తక్కువ ధరకే ప్రముఖ కంపెనీల బెస్ట్ స్మార్ట్ వాచ్ లు కూడా ఉన్నాయి. ఇటువంటి వాటిలో బోట్ స్మార్ట్ వాచ్ ముందు వరసగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ వాచ్ లపై ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తోన్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది.
బోట్ వేవ్ బీట్ 1.69ఇంచ్ హెచ్డీ డిస్ప్లే విత్ కంప్లీట్ హెల్త్ మానిటరింగ్ స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.5999 కాగా, ఏకంగా 78 శాతం తగ్గింపుతో అనగా రూ.4700 తగ్గింపుతో కేవలం రూ.1299కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ప్రత్యేకతల విషయానికి వస్తే 1.69 ఇంచ్ స్క్వేర్ హెచ్డీ డిస్ప్లే ఈ వాచ్ సొంతం. ఇంకా 550 Nits బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సీజన్ మానిటరింగ్ ఉంటుంది. టచ్ స్క్రీన్, ఫిట్ నెస్ & అవుట్ డోర్ తో పాటు 7 రోజుల బ్యాటరీ రన్ టైమ్ ఉంటుంది. ఈ వాచ్ బ్లాక్, బ్లూ, పిక్, రెడ్ తదితర నాలుగు కలర్లలో లభిస్తోంది.
Related News
Flipkart Super Cooling Days 2024: నేటి నుంచి ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్స్.. ఈ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు..!
‘సూపర్ కూలింగ్ డేస్ 2024’ పేరిట నిర్వహిస్తున్న ఈ సేల్లో AC (ఎయిర్ కండీషనర్), రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్, ఫ్యాన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.