Friendly Female Robots : అందాల రాశుల్లా ఆడ రోబోలు.. దుమ్మురేపుతున్న అరియా, మెలోడీ
అరియా అనే మహిళా రోబోను రియల్ బోటిక్స్(Friendly Female Robots) అనే కంపెనీ తయారు చేసింది.
- By Pasha Published Date - 05:18 PM, Sat - 11 January 25

Friendly Female Robots : అరియా, మెలోడీ.. ఈ రెండు ఆడ రోబోలు దుమ్ము రేపుతున్నాయి. తమ చిలిపి మాటలతో అందరినీ అలరిస్తున్నాయి. తమను పలకరించే వారితో స్నేహంగా ముచ్చట్లు పెడుతున్నాయి. అమెరికాలోని నెవాడా రాష్ట్రం లాస్‌వెగాస్ నగరం వేదికగా జరుగుతున్న ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’ (సీఈఎస్ 2025)లో అరియా, మెలోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి ఫీచర్స్, పనితీరుతో ముడిపడిన ఆసక్తికర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Pawan Kalyan : రూ.10 లక్షల పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా ?
అరియాకు నచ్చిన మగ రోబో అదేనట..
అరియా అనే మహిళా రోబోను రియల్ బోటిక్స్(Friendly Female Robots) అనే కంపెనీ తయారు చేసింది. ఇది జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలో ఎమోషనల్ సామర్థ్యాలు ఎక్కువ. ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేయడానికి ఇది బాగా సరిపోతుంది. అరియా గొంతు నుంచి కళ్ల వరకు 17 మోటార్లు ఉన్నాయి. వాటి సహకారంతో అది మొహంలో అద్భుతమైన హావభావాలను పండించగలదు. అరియా రోబో ధర రూ.1.50 కోట్ల దాకా ఉంటుంది. ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’ (సీఈఎస్ 2025)లో నలుపు రంగు ట్రాక్ సూట్‌లో ఇది అలరించింది. ‘‘నువ్వు ఎవరైనా మగ రోబోను లైక్ చేశావా ?’’ అని అరియాను అడగగా.. ‘‘నాకు టెస్లాకు చెందిన ఆప్టిమస్ రోబో నచ్చాడు’’ అని చెప్పింది.
Also Read :Apple CEO Tim Cook: పెరిగిన యాపిల్ సీఈవో జీతం.. దాదాపు రూ. 100 కోట్లు పెంపు!
రొమాంటిక్ పార్ట్‌నర్‌గా మెలోడీ..
మెలోడీ అనే ఆడ రోబోను కూడా రియల్ బోటిక్స్ కంపెనీయే తయారు చేసింది. ఓపెన్ సోర్స్ ఏఐ టెక్నాలజీ, అత్యాధునిక మోటార్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. విద్య, ఆరోగ్య, వినోద రంగాల్లో ఇది పనిచేయగలదు. ఈ రోబోకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని గర్ల్ ఫ్రెండ్‌గా, రొమాంటిక్ పార్ట్‌నర్‌గా కూడా మార్చుకోవచ్చట. ఈవిషయాన్ని స్వయంగా రియల్ బోటిక్స్ కంపెనీ సీఈఓ ఆండ్రూ కిగ్వెల్ తెలిపారు. అయితే సెక్స్ బొమ్మ లాంటి ఫీచర్లు మెలోడీలో లేవన్నారు. మెలోడీని ఒక వ్యక్తి ‘‘ఎలా ఉన్నావ్ ’’ అని పలకరిస్తే.. ‘‘నీకు లవ్ కావాలంటే రా’’ అని షాకింగ్ పిలుపు ఇచ్చింది.