Aadhar Update: ఆధార్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మరోసారి ఆ గడువు పెంపు.. చివరి తేదీ అప్పుడే!
యుఐడిఏఐ తాజాగా ఆధార్ వినియోగదారులకు మరో శుభవార్తను తెలిపింది. ఉచిత ఆధార్ గడువును మరోసారి పొడిగించింది.
- By Anshu Published Date - 11:04 AM, Sun - 19 January 25

యూఐడీఏఐ.. ఆధార్ వినియోగదారులకు శుభవార్తను తెలుపుతూ గతంలో చాలా సార్లు ఉచిత ఆధార్ గడువును పెంచుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూ ఇటీవల ఉచిత ఆధార్ గడువును ముగించింది. అయితే తాజాగా ఈ విషయంలో మరోసారి ఆధార్ వినియోగదారులకు శుభవార్తను తెలుపుతూ ఉచిత ఆధార్ అప్డేట్ మరోసారి పొడిగించింది. జూన్ 14 వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆధార్ వినియోగదారులో ఆధార్ కార్డులో ఉన్న చిరునామాను సవరించుకోవచ్చట.
అయితే ఆన్లైన్ విధానంలో ఆధార్ లో చిరునామాను అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆధార్ కార్డు చిరునామాను ఆన్ లైన్ లో చాాలా సులభంగా మార్చుకోవచ్చు. ముందుగా ssup.uidai.gov.in వెబ్ సైట్ కి వెళ్లి, ఆధార్ నంబర్ నమోదు చేసి తర్వాత, రిజిస్టర్ మొబైల్ వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. తర్వాత ఆధార్ లో చిరునామాను నవీకరించు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
దానిలో వివరాలు నమోదు చేసి, కొత్త చిరునామా అప్ డేట్ కు అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసుకోవాలి. వీటిలో పాస్ పోర్టు, బ్యాంకు స్టేట్ మెంట్, ఓటర్ ఐడీ, యుటిలిటీ బిల్లులు ఉంటాయి. తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దాని ఉపయోగించి మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు నిర్ణీత సమయంలో మీ ఆధార్ కార్డులో చిరుమానా అప్ డేట్ అవుతుంది.
ఇకపోతే ఆఫ్లైన్లో ఆధార్ లో చిరునామా ఏ విధంగా మార్చుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. ఇంటర్నెట్ లేనివారు, కంప్యూటర్ పై అవగాహన లేనివారు ఆఫ్ లైన్ విధానంలోనూ చిరుమానాను మార్చుకోవచ్చు. అయితే అందుకోసం దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ అప్ డేట్ ఫారం తీసుకుని, వివరాలు నమోదు చేయాలి. కొత్త చిరునామాను ధ్రువీకరించే రుజువులు అందజేయాలి. బయోమెట్రిక్ తో మీ గుర్తింపును ప్రామాణీకరించాలి. అక్కడి సిబ్బంది మీ చిరునామా మార్పుకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. దీని కోసం నామ మాత్రపు రుసుము వసూలు చేస్తారు. మీ సర్వీస్ నంబర్ ను, రశీదును జాగ్రత్త చేసుకోవాలి. సుమారు రెండు వారాల్లో మీ ఆధార్ కార్డులో కొత్త చిరునామా అప్ డేట్ అవుతుంది.