Whatsapp: వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేశారంటే అంతే సంగతులు?
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం
- By Anshu Published Date - 03:24 PM, Thu - 20 October 22

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ను చాటింగ్ చేయడం కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇకపోతే వినియోగదారులు పెరుగుతున్న కొద్ది వాట్సాప్ సంస్థ కూడా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రైవసీ సెక్యూరిటీ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అంతేకాకుండా వాట్సాప్ ను దుర్వినియోగం చేసే అకౌంట్స్ ని ప్రతినెలా బ్లాక్ చేస్తూ వస్తోంది. కాగా వాట్సాప్ రూల్స్ పాటించనందుకుగాను చాలా అకౌంట్స్ ని బ్లాక్ చేసింది వాట్సాప్ సంస్థ.
ఆగస్టు నెలలో వాట్సాప్ సంస్థ వారు ఏకంగా 2.3 మిలియన్ ఖాతాలను బ్లాక్ చేసింది. మరి ఇటువంటి పనులు చేస్తే వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్ లు ఎక్కువ అవ్వడంతో ఇందుకోసం ఒక లేబుల్ ని రూపొందించింది. దీని ద్వారా ఆ సందేశం పై ఎటువంటి సందేహం ఉన్న అది ఫార్వర్డ్ మెసేజ్ అని లేబుల్ చేయబడి ఉంటే దానిని షేర్ చేయకుండా ఉండవచ్చు. అలాకాకుండా ఆ తప్పుడు సందేశాన్ని పదేపదే ఫార్వర్డ్ చేస్తే తప్పకుండా వాట్సాప్ ను బ్లాక్ చేస్తారట. అదేవిధంగా ఒకేసారి వరుసగా పెద్ద పెద్ద మెసేజ్లు పంపడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తుంది వాట్సాప్ సంస్థ. మెషిన్ యూజర్ రిపోర్ట్ లర్నింగ్ ద్వారా ఆటోమేటెడ్ సందేశాలను పంపే వారి వాట్సాప్ ను బ్లాక్ చేస్తోంది.
అలాగే బ్రాడ్ కాస్టింగ్ నుంచి పంపిన మెసేజ్లు మీ నెంబర్ను సేవ్ చేసినప్పుడు మాత్రమే రిసీవర్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. ఒకవేళ దానిని ఎక్కువగా ఉపయోగిస్తే వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అలాగే ఏ వ్యక్తి అయినా గ్రూపులోకి యాడ్ చేసుకునే ముందు వారి అనుమతిని తీసుకోవడం తప్పనిసరి. అటువంటప్పుడు సదరు వ్యక్తి రిపోర్ట్ చేస్తే ఆ అకౌంట్ బ్లాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాట్సాప్ వినియోగదారులు ఎప్పుడూ కూడా తమకు తెలియని వ్యక్తులకు వాట్సాప్ తో కనెక్ట్ అవ్వాలని మెసేజ్లు పంపితే మాత్రం అకౌంట్ బ్లాక్ అవడం ఖాయం . వాట్సాప్ వినియోగించేవారు వాట్సాప్ నిబంధనలు, షరతులను వినియోగదారుడు తప్పకుండా అంగీకరించాలి. లేదంటే కంపెనీ వెంటనే ఆ అకౌంట్ ని బ్లాక్ చేస్తుంది.