Honor Smartphone: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న హానర్ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!
అద్భుతమైన ఆధ్యాత్మిక ఫీచర్లతో హానర్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకుంటోంది.
- By Anshu Published Date - 11:00 AM, Mon - 19 August 24

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది హానర్ సంస్థ. ఇకపోతే ఈ మధ్యకాలంలో హానర్ బ్రాండ్ నుంచి సరైన ఫోన్ రావడం లేదు. దీంతో ఈ కంపెనీ ఆశలన్నీ కూడా ఇటీవల విడుదల చేసిన హానర్ 200, హానర్ 200 ప్రో ఫోన్లపైనే ఉన్నాయి. వీటిని జూలై నెలలో భారత్ లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. హానర్ వీటిని ప్రీమియం ఫోన్లుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. హానర్ 200, హానర్ 200 ప్రోలలో పూర్తి స్థాయిలో అత్యాధునిక స్పెసిఫికేషన్ లను కలిగి ఉన్నాయి. రెండు పరికరాలు గరిష్టంగా 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో అమోల్డ్ డిస్ ప్లేను కలిగి ఉంటాయి. హానర్ 200లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో ఉంటుంది. హానర్ 200 ప్రో మరింత శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 9ఎస్ జెన్3ని ఉపయోగిస్తుంది. రెండు ఫోన్ లు కూడా పోర్ట్రెయిట్ మోడ్ లతో సహా అధునాతన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ లతో గొప్ప మొబైల్ ఫోటోగ్రఫీని అందిస్తున్నాయి. రెండు ఫోన్లూ కూడా 5200ఎంఏహెచ్ బ్యాటరీని ఉన్నాయి. హానర్ 100వాట్ల సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతునిస్తుంది, అయితే కంపెనీ బాక్స్‌లో ఛార్జర్ రాదు.
ఫోన్‌లు మ్యాజిక్ ఓఎస్ 8.0 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తాయి. ఇకపోతే ధరల విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లు మిడ్ రేంజ్‌కు మించి ఉంటాయి. హానర్ 200 ధర రూ. 34,999 నుంచి ప్రారంభం అవుతుంది. హానర్ 200 ప్రో ప్రారంభ ధర రూ. 57,999 గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 కలిగినప్పటికీ ఈ ధర చాలా తక్కువనే చెప్పాలి.హానర్ 200 ప్రోలో 50ఎంపీ వైడ్ షూటర్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యూనిట్, 50ఎంపీ టెలిఫోటో యూనిట్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది సినిమాటిక్ స్టైల్ లో చిత్రాలను తీయగలుగుతుంది. హానర్ 200లోనూ ఇదే సామర్థ్యంతో కెమెరా ఉంటుంది కానీ లెన్స్ మారుతుంది. హానర్ 200 సిరీస్‌లోని రెండు ఫోన్‌లు 5200ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. బ్యాటరీ రోజంతా శక్తిని అందిస్తుంది. రెండు ఫోన్‌లు వినియోగాన్ని బట్టి దాదాపు 12 నుంచి 13 గంటల బ్యాటరీ జీవితాన్ని కచ్చితంగా అందిస్తాయి. 100వాట్ల సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతునిస్తుంది.