BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. తక్కువ ధరకే అద్భుతమైన ప్లాన్స్!
మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ని తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ.
- By Nakshatra Published Date - 11:30 AM, Tue - 3 September 24
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు బీఎస్‌ఎన్‌ఎల్. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో ఇటువంటి సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జి ప్లాన్లను అందిస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. గవర్నమెంట్ తో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ 5జీ సేవలను విస్తరించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే 4 జి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లాన్ లను ఎక్కువగా అందిస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్. దీంతో వేలాది మంది ప్రతిరోజూ బీఎస్‌ఎన్‌ఎల్ కి పోర్ట్ అవుతున్నారు. వినియోగదారులను మరింత పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ తాజాగా మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. రూ. 2999 బీఎస్‌ఎన్‌ఎల్ ఏడాది రీఛార్జీ ప్లాన్ ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చట. ఇందులో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 2999 రీఛార్జ్ ప్లాన్ కొత్తగా పరిచయం చేసింది. ఇది సుదీర్ఘ సమయం వ్యాలిడిటీ పొందాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాలి అనుకున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది 365 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకునే వారికి అన్లిమిటెడ్ కాల్స్ అలాగే ఇతర లాభాలను కూడా పొందవచ్చు.
ఇంటర్నెట్ డేటా 600 జీబీ డేటా ను పొందవచ్చు. హైస్పీడ్ డేటా 600 జీబీ డేటా, ఓటీటీ కంటెంట్ ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. 600 జీబీ డేటా అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్ నెట్ పొందుతారు. ఈ రీఛార్జీ ప్లాన్ రూ.2999 ప్లాన్ కాల్స్, డేటా పొందుతారు. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్ సబ్‌స్క్రీప్షన్ నెల పాటు పొందుతారు. ఈ ప్లాన్‌లో EROS NOW ఎంటర్‌టైన్మెంట్ కూడా నెలపాటు అదనంగ పొందవచ్చని తెలిపింది. దీంతో కొన్ని సినిమాలు, టీవీ షోస్, మ్యూజిక్ పొందుతారు. అంతేకాదు ఈ రీఛార్జీ ప్లాన్‌లో 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ప్రతిరోజూ పొందుతారు. పెరిగిన టెలికాం ధరల నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ అత్యంత ఆధరణ పొందుతోంది. రూ.2999 రీఛార్జీ ప్లాన్ తో మీ బడ్జెట్ పై ఏ మాత్రం భారం పడకుండా హాయిగా ఎంచుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది.
Related News
BSNL: మరింత స్పీడ్ పెంచిన బీఎస్ఎన్ఎల్.. 5జీ నెట్వర్క్ పై కీలక అప్డేట్?
5జీ నెట్ వర్క్ పై కీలక అప్డేట్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్ సంస్థ.