BSNL: వినియోగదారులకు మరో అద్భుతమైన శుభవార్తను తెలిపిన బీఎస్ఎన్ఎల్.. నెల రోజుల పాటు ఫ్రీ ఇంటర్నెట్!
ప్రముఖ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్ఎల్ ఇప్పుడు కస్టమర్ల కోసం మరొక అద్భుతమైన ఆఫర్ ను తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Fri - 27 December 24

ప్రముఖ టెలికాము కంపెనీలలో ఒకటైన బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లు 1 నెల పాటు ఉచిత ఇంటర్నెట్ ని పొందే ప్లాన్ ను తీసుకువచ్చింది. రెండు ప్లాన్ లలో కంపెనీ వినియోగదారులకు 1 నెల పాటు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ను అందిస్తోంది. రెండు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ల ధర 500 రూపాయల కంటే తక్కువగా ఉన్నాయి. అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటాను పొందవచ్చు. ఇంతకీ ఆ రెండు ప్లాన్లు ఏంటి అన్న విషయానికి వస్తే.. బీఎస్‌ఎన్ఎల్ పండుగ ఆఫర్ లో భాగంగా ఉచిత డేటాను ఇస్తోంది. కంపెనీ తన ఫైబర్ బేసిక్ నియో, ఫైబర్ బేసిక్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లతో ఈ ఆఫర్ ను అందిస్తోంది.
మీరు ఒకేసారి మూడు నెలల పాటు ఏదైనా ప్లాన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఉచిత ఇంటర్నెట్ ప్రయోజనం పొందుతారు. బీఎస్‌ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ నియో ప్లాన్ ధర కేవలం రూ.449 మాత్రమే. ఈ ప్లాన్ లో మీరు నెలకు 3.3టీబీ డేటాను పొందవచ్చు..అంటే మీరు ఒక నెలలో 3300జీబీ డేటాను ఉపయోగించవచ్చు. ఇది మీకు 30Mbps హై స్పీడ్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇది మొబైల్ లో అందుబాటులో ఉన్న డేటా వేగం కంటే చాలా ఎక్కువ. మీరు మొత్తం 300జీబీ డేటాను వినియోగించుకుంటే, మీరు 4Mbps వేగం పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ బేసిక్ నియో ప్లాన్ తో మీరు అన్ని నెట్‌వర్క్ లకు ఉచిత కాలింగ్ కూడా పొందుతారు. మీరు కలిసి 3 నెలల ప్లాన్ ను కొనుగోలు చేస్తే, మీరు ప్లాన్ పై రూ. 50 తగ్గింపు కూడా పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ బేసిక్ ప్లాన్ ధర రూ. 499 మాత్రమే.
మీకు మరింత డేటా స్పీడ్ కావాలంటే మీరు దాని కోసం వెళ్ళవచ్చు. ఈ ప్లాన్‌లో కూడా కంపెనీ యుజర్స్ 3300జీబీ డేటాను అందిస్తుంది. మీరు 50Mbps వేగం ఉంటుంది.ఫైబర్ బేసిక్ నియో ప్లాన్ వలె, ఇది కూడా డేటా పరిమితిని పూర్తి చేసిన తర్వాత మీకు 4Mbps వేగాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ మీకు లోకల్ మరియు STD కోసం ఉచిత అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఫైబర్ బేసిక్‌ను ఒకేసారి 3 నెలల పాటు కొనుగోలు చేస్తే, మీకు రూ.100 తగ్గింపు కూడా లభిస్తుందట.