Smart Phone Repair : స్మార్ట్ ఫోన్ ని రిపేర్ కి ఇస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone)ను ఎన్నో రకాల విషయాలకు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే..
- Author : Naresh Kumar
Date : 27-11-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
Smart Phone Repair : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తూనే ఉంటారు. అలా స్మార్ట్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ (Smart Phone)ను ఎన్నో రకాల విషయాలకు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత ఫోటోలు బ్యాంకింగ్ వివరాలు మన పర్సనల్ ఫొటోస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు స్మార్ట్ ఫోన్ అనుకోకుండా రిపేర్ అవ్వడం అన్నది కావాలి. అలా రిపేర్ అయినప్పుడు చాలామంది వెంటనే రిపేరు సెంటర్ లో ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు.
We’re Now on WhatsApp. Click to Join.
అయితే కొన్ని పర్సనల్ విషయాలు అందులో ఉన్నప్పుడు మొబైల్ రిపేర్ కి ఇచ్చేముందు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మరి ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ మొబైల్‌లో బ్యాంకింగ్ యాప్‌లు ఏవైనా ఉంటే ముందుగా వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. యాప్స్ ను తొలగించే ముందు పాస్‌వర్డ్, యూజర్ నేమ్‌లను ఒక పేపర్‌పై నోట్ చేసుకోవడం మంచిది.
ఇక స్మార్ట్ ఫోన్ (Smart Phone)లోని నోట్ ప్యాడ్‌లో పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత వివరాలను నోట్ చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఫోన్‌ను ఎవరికైనా ఇచ్చేప్పుడు నోట్స్‌ను డిలీట్ చేయడం అసలు మర్చిపోకండి.
అలాగే సోషల్ మీడియా అకౌంట్ మిస్ కాకూడదు అంటే అన్ని అకౌంట్స్ లాగౌట్ చేసి తర్వాత ఫోన్ రిపేర్ కు ఇవ్వడం మంచిది. ఇక జీమెయిల్ అకౌంట్ కూడా లాగవుట్ అయిన తర్వాతే ఫోన్‌ను రిపేర్ సెంటర్‌కు ఇవ్వాలి. జీమెయిల్ అకౌంట్‌కు సంబంధించి అన్ని వివరాల్లో గోప్యత పాటించడమే చాలా అవసరం. ఫోన్ గ్యాలరీలో ఏవైనా వ్యక్తిగత ఫొటోలు ఉంటే డిలీట్ చేసిన తర్వాతే వాటిని రిపేర్ సెంటర్లకు ఇవ్వాలి. ఒకవేళ ఫొటోలు కోల్పోకుండా ఉండాలంటే వాటిని ఒక మెమొరీ కార్డ్ లేదా, పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. లేదా డ్రైవ్‌లో సేవ్‌లో చేసుకోవచ్చు. ఈ విషయాలు ఏవి మీరు చూసుకోకుండా అలాగే మొబైల్ రిపేర్ కి ఇవ్వడం వల్ల వాళ్లు మీ వ్యక్తిగత విషయాలను ప్రైవసీకి సంబంధించిన విషయాలను తెలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొబైల్ రిపేర్ కి ఇచ్చేముందు పైన చెప్పిన విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.
Also Read: Puja Room Decoration : ఇంట్లో పూజగది డెకొరేషన్‌కు టిప్స్ ఇవీ..