OnePlus: కేవలం రూ.27 వేలకే రూ. 47 వేల ఫోన్.. ఎలా అంటే?
ఇటీవల కాలంలో మొబైల్ తయారీ సంస్థలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట
- By Nakshatra Published Date - 06:29 PM, Sun - 30 June 24
![OnePlus: కేవలం రూ.27 వేలకే రూ. 47 వేల ఫోన్.. ఎలా అంటే?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/MixCollage-30-Jun-2024-06-26-PM-1128.jpg)
ఇటీవల కాలంలో మొబైల్ తయారీ సంస్థలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వన్‌ప్లస్ సంస్థ వినియోగదారులకు ఒక చక్కటి శుభవార్తను తెలుపుతూ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై దాదాపు 10000 డిస్కౌంట్ ను అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే… వన్‌ప్లస్11ఆర్ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 39,999 కాగా అమెజాన్‌లో 30 శాతం డిస్కౌంట్ లో భాగంగా ఈ మొబైల్ కేవలం రూ. 27,999కి లభిస్తుంది.
దీంతో పాటు అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 839 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇంతటితో ఆగిపోలేదండోయ్.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 26,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలా దాదాపు ఈ ఫోన్ పై పదివేల కంటే ఎక్కువ డిస్కౌంట్ నే అందిస్తోంది వన్ ప్లస్ సంస్థ. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. కాగా కెమెరా విషయానికొస్తే..
ఇందులో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్లో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2772*1240 పిక్సెల్స్ రిజల్యూజన్ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తీసుకొచ్చారు. స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ సిమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. 100 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి డబ్బులు ఆధా చేసుకోండి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![OnePlus Nord CE4 Lite 5G: రూ. 20 వేలలోపే వన్ ప్లస్ మొబైల్.. స్పెసిఫికేషన్లు ఇవే..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/OnePlus-Nord-CE-4.jpeg)
OnePlus Nord CE4 Lite 5G: రూ. 20 వేలలోపే వన్ ప్లస్ మొబైల్.. స్పెసిఫికేషన్లు ఇవే..!
OnePlus Nord CE4 Lite 5G: వన్ ప్లస్ ఇటీవల తన అభిమానుల కోసం చౌకైన ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ మొబైల్ ధర రూ.20,000 లోపే ఉంది. ఈ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5G (OnePlus Nord CE4 Lite 5G) విక్రయం ఇప్పుడు ఈరోజు అంటే జూన్ 27 నుండి ప్రారంభమైంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5G పెద్ద బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో […]