Amazon Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.. కేవలం రూ. 7వేలకే స్మార్ట్ టీవీ?
టెక్నాలజీ రోజురోజుకీ మరింత డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు
- By Nakshatra Published Date - 07:30 AM, Mon - 5 December 22
టెక్నాలజీ రోజురోజుకీ మరింత డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్‌లు ఇలా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అతి తక్కువ ధరకే అందుబాటులో లభిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే మీరు తక్కువ బడ్జెట్లో ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అటువంటి వారికి ఒక చక్కని శుభవార్త. కేవలం 7వేల రూపాయలకు ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ని అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.
అయితే గతంలో ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 25 వేలు పైనే ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అదే స్మార్ట్ టీవీ కేవలం రూ. 10 వేలు లోపే అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ సంస్థ రూ. 7వేలకు అదిరిపోయే స్మార్ట్ టీవీ తన కస్టమర్ లకు అందిస్తోంది. ఆ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. VW 80 సీఎం 32 ఇంచెస్ హెచ్డీ రెడీ LED టీవీ VW32A బ్లాక్ 2021 మోడల్ టీవీ పై బంపర్ ఆఫర్ ను ప్రకటించింది అమెజాన్ సంస్థ. ఈ స్మార్ట్ టీవీ బడ్జెట్ లోనే దొరుకుతోంది. కాగా కంపెనీ నిర్ణయించిన ఈ టీవీ అసలు ధర రూ.12,999. అయితే అమెజాన్ వెబ్సైట్లో ఈ స్మార్ట్ టీవీ 48% డిస్కౌంట్ తో లభ్యమవుతోంది.
కాబట్టి ఈ స్మార్ట్ టీవీని కస్టమర్లు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 60 hz రిఫ్రెష్ రేట్, 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఉంది. ఈ టీవీ పై ఒక సంవత్సరం వారంటీని కూడా పొందుతారు. ఇతర ప్రాడెక్ట్ లతో అనుసంధానం కోసం కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో HDMI అలాగే USB, AV పోర్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Related News
Amazon Offer: వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై భారీగా తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే