Honda Hness CB 350: అద్భుతమైన లుక్ లో హోండా హైనెస్ సిబి 350.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
దేశవ్యాప్తంగా రోజురోజుకీ ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. నెలలో పదుల సంఖ్యలో
- By Nakshatra Published Date - 07:00 AM, Sat - 11 March 23

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. నెలలో పదుల సంఖ్యలో కొత్త కొత్త మోడల్స్ ఫీచర్స్ కలిగిన బైక్ లు మార్కెట్ లోకి విడుదల అవుతుండగా నెలకి వేల సంఖ్యలో బైక్ లు విక్రయిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైక్లు విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా ప్రముఖ బైక్ తయారీ సంస్థ హోండా ఇప్పటికే మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. హోండా కంపెనీ సరికొత్త 2023 హోండా హైనెస్ సీబీ 350 సోలో రైడర్ ఎడిషన్ బైక్ ని విడుదల చేసింది.
కాగా చూడడానికి బుల్లెట్ బైక్ లేదా రాయల్ ఎన్ ఫీల్డ్ లా కనిపించే ఈ బైక్‌కి కేవలం సింగిల్ సీట్ మాత్రమే ఉంటుంది. ఒకరు మాత్రమే రైడింగ్ చేసేందుకు వీలు ఉంది. కాగా ఈ బైక్‌కి కంపెనీ 4 యాక్సెసరీ కిట్స్ ఇచ్చింది. ఈ కిట్స్ ధర రూ.7,500 నుంచి రూ.22,200 దాకా ఉంది. హోండా హైనెస్ సీబీ 350 సోలో రైడర్ ఎడిషన్‌కి కేఫ్ రేసర్, కంఫర్ట్, టూరెర్, సోలో కారియర్ అనే 4 యాక్సెసరీ కిట్స్ ఉన్నాయి. కేఫ్ రేసర్ కిట్‌కి ఓల్డ్ స్కూల్ హెడ్‌వైట్ కౌల్, టాన్ సోలో సీట్, బాడీ కలర్డ్ రియర్ సీట్ కౌల్, ఫోర్క్ గైటెర్స్, సంప్ గార్డ్, ట్యాక్ చుట్టూ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈ కిట్ ధర రూ.22,200గా ఉంది.
కంఫర్ట్ కిట్‌లో పిల్లియన్ సీట్స్, పిల్లియన్ బ్యాక్‌రెస్ట్, సాడ్డిల్ స్టేస్, లార్జర్ ఫుట్‌పెగ్స్, నకుల్ గార్డ్స్, లార్జ్ ఫ్రంట్ విండ్ స్క్రీన్ ఉన్నాయి. ఈ కిట్ ధర రూ.16,500. టూరర్ కిట్‌కి కంఫర్ట్ కిట్‌కి ఉండే యాక్సెసరీస్ ఉన్నాయి. అదనంగా దీనికి వెనక పిల్లియన్ బ్యాక్ రెస్ట్ స్థానంలో లగేజ్ ర్యాక్ ఉంది. ఈ కిట్ ధర రూ.17,600. అలాగే క్యారియస్ కిట్ టాన్ బ్రౌన్ సోలో సీట్, లగేజ్ క్యారియర్, స్మాల్ ఫ్రంచ్ విజర్, వీల్ స్ట్రిప్స్, ఫోర్క్ గైటర్స్ కలిగివుంది. ఈ కిట్ ధర రూ.16,200.

Related News

TVS vs Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ తో ఢీ.. సరికొత్త స్పోర్ట్స్ బైక్ రెడీ చేస్తున్న TVS
స్పోర్ట్స్ బైక్స్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీ పడేందుకు TVS మోటార్ కంపెనీ రెడీ అవుతోంది. ఇందుకోసం తన యూరోపియన్ భాగస్వామి BMW తో కలిసి పని చేయాలని