State Assembly Elections
-
#India
Maharashtra Elections : మహారాష్ట్రలో 14 మంది అధికారులు బదిలీ
Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ క్రమంలోనే ప్రభుత్వం వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీల స్థాయి 14 మంది అధికారులను బదిలీ చేసింది. సెప్టెంబరు 26 నుంచి 28 వరకు మహారాష్ట్రలో పర్యటించిన ఈసీ, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది బదిలీలకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఈ అధికారులను బదిలీ చేశారు.
Date : 15-10-2024 - 12:02 IST