Karnataka Hijab Row
-
#South
Karnataka Hijab Row: పరీక్షలు రాయని విద్యార్ధులకు మరో ఛాన్స్..!
హిజాబ్ వివాదం పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అసంతృప్తితో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ వివాదం నేపధ్యంలో అజ్ఞానం కారణంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు ముందు పరీక్షలకు తప్పిపోయిన విద్యార్థులు, రెండోసారి పరీక్షలకు అవకాశం పొందవచ్చని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. తాజాగా గురువారం అసెంబ్లీలో ఈ అంశం పై చర్చ జరిగింది. ఈ క్రమంలో పరీక్షలు రాయని విద్యార్థులకు రెండో అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ బైరే […]
Date : 18-03-2022 - 2:24 IST -
#South
Karnataka Hijab Row: మంగళూరులో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య హిజాబ్ రగడ..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని, పి.దయానంద పాయ్, పి.సతీష్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్ గొడవ చెలరేగింది. కర్నాటకలో ఇప్పటికే హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరు కావద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండగా, కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించినప్పుడు పెట్టుకునే పిన్ను తలపై ఉంచుకొని హాజరయ్యారు. అది చూసిన ఓ వర్గం విద్యార్థులు వారిని బయటికి పంపాలని సిబ్బందిని కోరారు. దీంతో కొంతమంది విద్యార్థులు పరీక్ష […]
Date : 05-03-2022 - 11:54 IST -
#South
Hijab row: హిజాబ్ ధరిస్తే.. తిరిగి ఇళ్ళకు వెళ్ళాల్సిందే..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో వారం రోజులుగా మూతపడిన ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. పలు ప్రాంతాల్లో కొంత మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీలకు హాజరయ్యారు. శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయపుర, బిజాపుర్, కలబుర్గిలో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీలకు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉడిపిలోని ప్రభుత్వ జి శంకర్ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్‌ను హిజాబ్ […]
Date : 17-02-2022 - 4:09 IST -
#South
Hijab Row: సుప్రీంకోర్టుకు చేరిన.. కర్నాటక హిజాబ్ వివాదం
కర్నాటకలో రచ్చ లేపుతున్న హిజాబ్ వివాదం పై, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపేలంటూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఈ వివాదం పై హైకోర్టులో విచారణ జరపగా, తుది తీర్పు వచ్చేంత వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫారం మాత్రమే ధరించాలని, ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో […]
Date : 11-02-2022 - 9:58 IST