Indian Syrup
-
#World
18 Kids Died: ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు సిరప్ తాగి 18 మంది మృతి
గాంబియా తర్వాత ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ (Uzbekistan)లో భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన దగ్గు సిరప్ (syrup) తాగి పిల్లలు మరణించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. 18 మంది పిల్లల (18 kids) మరణానికి ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీని నిందించింది. భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Published Date - 10:15 AM, Thu - 29 December 22