Humpy Wins Silver
-
#Sports
Koneru Humpy: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో రజతం
ప్రపంచ బ్లిట్జ్ టోర్నీ చరిత్రలో తెలుగమ్మాయి కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి రోజు పోటీల్లో 9 రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉన్న ఆమె, 17 రౌండ్ల తర్వాత 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి అయిదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన ఆమె, చివరి 12 రౌండ్లలో ఒక్క పరాజయం లేకుండా పోడియం ఎక్కడం విశేషం.
Published Date - 08:30 AM, Sat - 31 December 22